Farmhouse Case: దూకుడు పెంచిన సిట్.. ఫామ్‌హౌస్ కేస్‌లో మరిన్ని అరెస్టులకు రంగం సిద్ధం..
ఫామ్‌హౌస్ కేస్‌లో మరిన్ని అరెస్టులకు రెడీ అవుతోంది సిట్. నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో ముమ్మర తనిఖీలు చేస్తోంది. సిట్ దూకుడు ఇలాగుంటే, మరోవైపు ఎమ్మెల్యేలకు..
ఫామ్‌హౌస్ కేస్‌లో మరిన్ని అరెస్టులకు రెడీ అవుతోంది సిట్. నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో ముమ్మర తనిఖీలు చేస్తోంది. సిట్ దూకుడు ఇలాగుంటే, మరోవైపు ఎమ్మెల్యేలకు థ్రెటెనింగ్ కాల్స్ సంచలనం రేపుతున్నాయ్. ఇంకోవైపు, A2 నందకుమార్‌కి ఊహించని షాకిచ్చింది జీహెచ్ఎంసీ. ఫామ్‌హౌస్ కేస్‌లో టోటల్ అప్‌డేట్స్‌ని ఇప్పుడు చూద్దాం
మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో దూకుడు పెంచింది సిట్. ఏకకాలంలో ఐదు రాష్ట్రాల్లో రెయిడ్స్ నిర్వహిస్తోంది. మొత్తం ఏడు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు సిట్ అధికారులు. మెయిన్‌గా నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో అణువణువూ గాలిస్తున్నారు. హైదరాబాద్‌లో.. ఏ2 నందకుమార్ హౌస్ అండ్ హోటల్‌లో తనిఖీలు చేసింది సిట్. షేక్‌పేట్‌లోని నందు ఇంట్లో సీసీ ఫుటేజ్‌తోపాటు ఆధారాలను సేకరించింది. అలాగే, ఫిల్మ్‌నగర్‌లో నందకుమార్ నిర్వహిస్తోన్న డెక్కన్ హోటల్‌లోనూ సోదాలు చేసింది సిట్.
సిట్ తనిఖీలు జరుపుతున్న టైమ్‌లోనే A2 నందకుమార్‌కి ఊహించని షాకిచ్చింది జీహెచ్ఎంసీ. ఫిల్మ్‌నగర్‌లో నందకుమార్ లీజ్ తీసుకున్న ప్రాపర్టీలో నిర్మాణాలను కూల్చేసింది. అనుమతి లేకుండా డెక్కన్ కిచెన్ హోటల్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ కూల్చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. అనేకసార్లు నోటీసులిచ్చినా, స్పందించకపోవడంతో పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. కోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాలను కూల్చివేశామంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.
అయితే, తమ హోటల్‌కి అన్ని అనుమతులు ఉన్నాయంటున్నారు నందకుమార్ సతీమణి. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా, కావాలనే అక్రమంగా కూల్చివేశారని ఆరోపిస్తున్నారు. సిట్ దూకుడు ఇలాగుంటే, మరోవైపు ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావుకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు టాక్. థ్రెటెనింగ్ కాల్స్‌పై ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యేల నివాసాలు, క్యాంప్ ఆఫీస్‌ల దగ్గర భద్రతను, నిఘాను పెంచింది సర్కార్. అయితే, థ్రెటెనింగ్ కాల్స్, సోషల్ మీడియాలో బెదిరింపు పోస్టులపైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ఎమ్మెల్యేలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..