YS Sharmila: వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్.. కారుతో సహా లిఫ్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు..
వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 353, 333,337 సెక్షన్ల కింద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు రాజ్‌భవన్ రోడ్డులో కాసేపు హైడ్రామా నడిచింది.
వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 353, 333,337 సెక్షన్ల కింద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు రాజ్‌భవన్ రోడ్డులో కాసేపు హైడ్రామా నడిచింది. రాజ్‌భవన్‌రోడ్డులో కలకలం సృష్టించిన వైఎస్ షర్మిల కారుని.. షర్మిలతో సహా పోలీసులు లిఫ్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. క్రేన్ ద్వారా పోలీసులు కారును తీసుకెళ్లారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని.. షర్మిలను విడుదల చేయాలని కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ కు ఎవరు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ బారీకేడ్లు అడ్డుపెట్టారు. అంతకుముందు ప్రగతి భవన్ కు ధ్వంసమైన కారుతో బయలుదేరగా.. షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజల కోసం పోరాడుతుంటే.. తనను బలవంతంగా పోలీసులు అరెస్టు చేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు.
కారు ఎవరిదీ..?
అయితే, షర్మిల కారుపైనే ఇప్పుడు అందరి దృష్టీ ఉంది. హైదరాబాద్ రాజ్‌భవన్‌రోడ్డులో పోలీసులు లిఫ్ట్ చేసిన కారు టయోటా ఫార్చునర్.. దీని ఖరీదు 50 లక్షలు.. రిజిస్ట్రేషన్ నెంబర్ KA51ME151..ఇంతగా హైదరాబాద్‌లో హల్‌చల్ చేసిన ఈ కారు ఇంతకీ ఎవరిది? ఇదే ప్రశ్నకు సమాధానాన్ని శోధిస్తే ఇది కర్నాటకలో రిజిస్టరైన కారుగా తేలింది. హైదరాబాద్ రాజ్‌భవన్‌రోడ్డులో పోలీసులు లిఫ్ట్ చేసిన కారు SRS ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో రిజిస్టరై ఉంది. ఆ కంపెనీకీ షర్మిలకీ ఏంటి సంబంధం అని విశ్లేషిస్తే.. బెంగుళూరుకి చెందిన ఈ కంపెనీలో వైఎస్.షర్మిల ఒక డైరెక్టర్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే కారుని ఈరోజు పోలీసులు తరలించారు.
అయితే మరో విషయం ఏంటంటే.. ఇదే కారు గతంలో కొన్ని సార్లు ట్రాఫిక్ రూల్స్‌ని అతిక్రమించినట్టు ఆధారాలున్నాయి. ఈ కారుపై తెలంగాణలో రెండు ట్రాఫిక్ చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఖమ్మం కిన్నెర సెంటర్‌లో ఓవర్ స్పీడ్ డ్రైవింగ్‌పై ఒక చలానా.. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఓవర్‌స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్‌లపై మరో చలానా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రెండు కేసులు కాకుండా ట్రాఫిక్ కి అంతరాయం కలిగించినందుకు ఇప్పుడు ఆకారుని ట్రాఫిక్ పోలీసులు తరలించారు. దీంతో కారుపై మొత్తం మూడు చలాన్లు నమోదైనట్టు తెలుస్తోంది.
అసలేం జరిగింది:
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల మరోసారి అరెస్టయ్యారు. పంజాగుట్ట సమీపంలో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం పోలీసుల కళ్లుగప్పి హైదరాబాద్ లోటస్ పాండ్ బయటకు వెళ్లిపోయారు. లోటస్ పాండ్ నుంచి ప్రగతి భవన్ వైపునకు వెళ్లినట్టుగా పోలీసులు అనుమానించారు. పోలీసులకు కళ్లు గప్పి ఇంటి నుంచి బయటకు వచ్చిన వైయస్ షర్మిల… ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు వెళ్లారు. ఇందులో భాగంగా పంజాగుట్ట సర్కిల్ దాటి ప్రగతి భవన్ వైపునకు వెళ్తుండగా పోలీసులు గుర్తించారు. అయితే నిన్న దాడిలో ధ్వంసమైన కారును నడుపుకుంటూ.. ప్రగతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్ షర్మిల ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..