AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T.Congress: ఆయన వచ్చేస్తున్నారోచ్.. పార్టీలోని లుకలుకలను సెట్ చేస్తారా.. ఎవరినైనా కట్ చేస్తారా..

తెలంగాణ కాంగ్రేస్ సంక్షోభానికి తెరదించేందుకు డిగ్గీరాజా రంగంలోకి దిగారు ..వచ్చి రావడంతోనే సీనియర్ ల భేటీ వాయిదా వేయించారు .స్వయంగా ఫోన్ లు చేసి సీనియర్ లకు సర్దిచెప్పారు.అయితే దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపడం వెనక ఏఐసీసీ వ్యూహం ఏంటీ..?

T.Congress: ఆయన వచ్చేస్తున్నారోచ్.. పార్టీలోని లుకలుకలను సెట్ చేస్తారా.. ఎవరినైనా కట్ చేస్తారా..
Digvijaya Singh
Sanjay Kasula
|

Updated on: Dec 20, 2022 | 4:50 PM

Share

టి.కాంగ్రెస్‌లో రేగిన అసంతృప్తి జ్వాలలను చల్లార్చేందుకు దిగ్విజయ్‌సింగ్‌ను పంపుతున్నారు సరే..! ఆయన రాకతో అంతా ఓకే అయిపోతుందా..? అసమ్మతిరాగం వినిపిస్తున్న జీ-9 నేతలు సర్దుకుంటారా..? నేరుగా ప్రియాంకా గాంధీ వస్తారన్న ప్రచారంలో సడెన్‌గా దిగ్విజయ్‌ సింగ్‌ ఎందుకు ఎంట్రీ ఇచ్చినట్లు? ఇప్పటికే పార్టీలో చాలా డ్యామేజ్ జరిగిందన్నది నిజం. మరి ఈ ఇష్యూని డిగ్గీరాజా డీల్ చేయగలరా? ఇదే అంశంపై ఇప్పుడు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.. నేరుగా ప్రియాంకనే వచ్చినా.. సమస్య పరిష్కారం కాకపోతే? ఆ తర్వాత కూడా నేతలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తే..? అప్పుడు పార్టీతోపాటే.. ప్రియాంక ఇమేజ్‌కు కూడా ఇబ్బంది తప్పదు. అందుకే మొదట డిగ్గీరాజాను సీన్‌లోకి దింపారని తెలుస్తోంది.

మరో కారణం కూడా ఉంది. దిగ్విజయ్‌కు ట్రబుల్ షూటర్‌గా పేరుంది. పైగా గతంలో ఉమ్మడి ఏపీ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌గా చాలా కాలం పనిచేశారు. పార్టీ సీనియర్లంతా పరిచయం. ఇక్కడి సమస్యలు, వర్గపోరు, విబేధాలపైనా ఇప్పటికే ఓ క్లారిటీ ఉంది. సో ఆయనైతే సీనియర్లతో మరింత లోతుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. పైగా హైకమాండ్‌కు విశ్వాసపాత్రుడు. అందుకే దిగ్విజయ్‌ వైపు మొగ్గుచూపింది..! మరి డిగ్గీరాజా ఎప్పుడు వస్తారు? ఏం రిపోర్ట్ చేస్తారు? ఆయనకు సీనియర్లు సహకరిస్తారా? ఆయన మాటలు ఆలకిస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక సీన్‌లోకి ప్రియాంకా గాంధీ ఎప్పుడు వస్తారన్నది కూడా ఆసక్తికరం…!

నేరుగా ప్రియాంకనే వచ్చినా.. సమస్య పరిష్కారం కాకపోతే? ఆ తర్వాత కూడా నేతలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తే..? అప్పుడు పార్టీతోపాటే.. ప్రియాంక ఇమేజ్‌కు కూడా ఇబ్బంది తప్పదు. అందుకే మొదట డిగ్గీరాజాను సీన్‌లోకి దింపారని తెలుస్తోంది. ఇప్పుడు ఆయన వచ్చి.. నేతలతో మాట్లాడి.. ఓ క్లారిటీకి వస్తారు. అసలు సమస్య ఎక్కడ మొదలైంది? దాన్ని పరిష్కరించాలంటే.. సీనియర్లలో గూడుకట్టుకుపోయిన అసంతృప్తిని తొలగించాలంటే ఏం చేయాలని అనేది బేరీజు వేస్తారు.! ఆ తర్వాత హైకమాండ్‌కు రిపోర్ట్ ఇస్తారు. అప్పుడు ప్రియాంకా గాంధీ యాక్షన్‌లోకి దిగుతారని తెలుస్తోంది. సో.. సమస్య ఏంటి.. ? ఏం చేయాలన్నదానిపై ఆమెకు కూడా ఓ క్లారిటీ వస్తుంది.

కమిటీల ప్రకటనతో మొదలైన రచ్చ సీనియర్ల రహస్య సమావేశల వరకు సాగింది. పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరి పై ఒకరు బహిరంగ ఆరోపణలు చేసే పరిస్తితి వచ్చింది. సమస్య పరిష్కారం కోసం ఎఐసీసీ సెక్రటరీ నదీమ్ జావిద్ ను రంగంలోకి దింపినా ఉపయోగం లేకుండా పోయింది.. దీంతో ఇష్యూని నేరుగా ప్రియాంక గాంధీ టేకప్ చేసి స్వయంగా రంగంలోకి దిగారు. తెలంగాణ కాంగ్రేస్ సంక్షోభం పై అర్దరాత్రి వరకు ఏఐసీసీ అధ్యక్షుడితో ఇంచార్జీ ఠాగూర్ చర్చించారు. పార్టీ పరిస్తితిపై పూర్తి స్తాయి నివేధికను ఇచ్చారు. నివేధికను చూసాక పరిస్ఠితి చేయి దాటి పోయిందని భావించిన అధిష్టానం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దింపింది. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కూడా సీఏల్పీ నేత భట్టి కి ఫోన్ చేసి సమస్య పరిష్కారానికి చొరవచూపుతామన్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా ఉత్తమ్ తో మాట్లాడి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు.

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్‌కు ఇంచార్జ్ గా దిగ్విజయ్ సింగ్‌ పని చేసారు. దీంతో టీ కాంగ్రెస్ సమస్య పరిష్కారానికి దిగ్విజయ్ సింగ్‌ సరైనవాడని ఏఐసీసీ భావించింది. అనుకున్నట్లుగానే మంగళవారం సాయంత్రం మహేశ్వర్ రెడ్డి ఇంట్లో జరగాల్సిన సీనియర్ల భేటీ వాయిదా వేయించారు డిగ్గిరాజా.. నేతలందరికి స్వయంగా ఫోన్ చేసి రెండు రోజుల్లో హైదరాబాద్‌లో అందరిని కలుస్తానని, సమస్య పరిష్కారిస్తానని హామీ ఇచ్చారట దిగ్విజయ్ సింగ్‌.

అయితే టి. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లకు రేవంత్ రెడ్డి వర్గానికి మధ్య తారాస్తాయికి చేరిన వర్గవిభేధాల ను పరిష్కరించడం దిగ్విజయ్ సింగ్ ముందు ఉన్న అతి పెద్దసవాల్. ఇరు వర్గాలకు ఒకరంటే ఒకరికి పోసకని పక్షంలో నేతల మధ్య దిగ్విజయ్ సింగ్‌ ఐక్యత కుదర్చడం కత్తిమీద సామే.. ఎందుకంటే గతంలో ప్రియాంక గాంధీ నేరుగా పిలిచి మాట్లాడినా ..రాహుల్ గాంధీ కలసి కట్టుగా పనిచేయాలని ఆదేశించినా నేతల మధ్య ఏ మాత్రం ఐక్యత రాగపోగా మరింత వైరం పెరిగింది.. దీంతో ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ ఏ మేరకు నేతలను కలుపుతారనేది చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం