Instant Food for Women: ఈ ఇన్ స్టెంట్ టిఫిన్స్ తో ఆరోగ్యం..ఆనందం..మహిళల కోసం ప్రత్యేకం
ఉదయం లేచిన టైమ్ నుంచి సుమారు మూడు నుంచి నాలుగు గంటలు ఒకటే పని.. ఈ పనిలో పని తినడం మానేస్తారు..వెంటనే నీరసం వచేస్తుంది. ప్రతి రోజూ ఇలా చేయడం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. సో ఈజీగా అయ్యే టిఫిన్స్ కోసం వెతుకుతుంటారు.
పని..పని..పని.. హౌస్ వైఫ్స్ కు ఉదయం నుంచి రాత్రి వరకూ ఒకటే పని. ఉదయాన్నే అయితే ఇంకా కష్టం. ఓ వైపు ఇళ్లు శుభ్రం చేయాలి. వంట చేయాలి. టిఫిన్ చేయాలి. పిల్లలను లేపి వారికి స్నానానికి వేడి నీళ్లు వేయాలి. వాళ్లకు స్నానం చేయించాలి. భర్తకు ఆఫీస్ కు , పిల్లల స్కూల్ కు క్యారెజ్ పెట్టాలి. మొత్తం ఒకటే పని. ఉదయం లేచిన టైమ్ నుంచి సుమారు మూడు నుంచి నాలుగు గంటలు ఒకటే పని.. ఈ పనిలో పని తినడం మానేస్తారు..వెంటనే నీరసం వచేస్తుంది. ప్రతి రోజూ ఇలా చేయడం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. సో ఈజీగా అయ్యే టిఫిన్స్ కోసం వెతుకుతుంటారు. వైద్యులు ఆరోగ్యంగా ఉంటూ కుటుంబం అంతా తినేలా..అలాగే ఈజీగా తయారయ్యే టిఫిన్స్ సూచిస్తున్నారు.. అవేంటో ఓ లుక్కేద్దాం.
గుడ్లు
ఇంట్లో గుడ్లు ఎల్లప్పుడు స్టాక్ చేసుకోవాలి. ఇన్ స్టంట్ టిఫిన్ల ఒక్కోరోజు గుడ్లను తీసుకోవచ్చు. ఎందుకంటే ఉడకబెట్టుకుని తినవచ్చు..అలానే ఆమ్లెట్ వేసుకోవచ్చు. బ్రెడ్ ను కాల్చి మధ్యలో ఆమ్లెట్ పెట్టుకుని సర్వ్ చేసుకుంటే బెస్ట్ టిఫిన్ ఐడియా.. గుడ్లలో ఉండే ప్రోటీన్ల కారణంగా ఆరోగ్యం కూడా లభిస్తుంది.
పండ్లు, పెరుగు
ప్రతి ఇంట్లో పెరుగు, పండ్లు తప్పని సరిగా ఉంటాయి. వీటినే ఉదయం టిఫిన్ లా కూడా తినవచ్చు. సీజనల్ గా దొరికే పండ్లను టాపింగ్ చేసుకుని, రెండు నుంచి మూడు స్పూన్ల పెరుగుతో ఆరోగ్యకరమైన టిఫిన్ లభిస్తుంది. ఇలా చేస్తే శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఫైబర్ ను అందించవచ్చు.
శాండ్విచ్ లు
శాండ్విచ్ లు ఒక ప్రసిద్ధి చెందిన అల్పాహారం. అయితే వాటిని ఇంట్లోనే తయారు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. శాండ్విచ్ తయారు చేసుకుంటే సరైన పదార్థులు ఎంచుకోవాలి. సింపుల్ గా పూర్తయ్యే శాండ్విచ్ రెసిపీ చూద్దాం. బ్రెడ్ ను టోస్ట్ చేసి..కొద్దిగా వెన్నత రోల్ చేయాలి. అనంతరం కొన్ని కీర దోసకాయ ముక్కులు, టమాటోతో సర్వ్ చేసుకుంటే రుచికరమైన శాండ్విచ్ రెడీ అవుతుంది.
ఇన్ స్టంట్ ఓట్స్
ఇది అందరూ ఇష్టంగా తినే వంటకం. చిన్న పిల్లాడు కూడా మూడు నుంచి ఐదు నిమిషాల్లో చేసేస్తాడు. మార్కెట్ లో దొరికే ఇన్ స్టంట్ ఓ మిక్స్ తెచ్చుకుని వేడి నీళ్లల్లో వేసుకుని రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికిస్తే వేడి వేడి ఓట్స్ రెడీ. ఈ ఓట్స్ అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. ఒక్క కప్పు ఓట్ మిక్స్ తింటే దాదాపు 10 గ్రామల ప్రోటీన్లు అందుతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..