Iron Deficiency Remedies: ఇవి తిన్నారంటే ఐరన్ లోప సమస్యలు దూరం..మహిళలూ ఓ లుక్కెయ్యండి

మహిళల్లో పిరియడ్స్, గర్భధారణ, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, కొన్ని వైద్య రుగ్మతల వల్ల ఐరన్ లోపం ఏర్పడే అవకాశం ఉంది. ఐరన్ లోపం కారణంగా మగత, శ్వాస ఆడకపోవడం, నాలుక నొప్పి, వాపు, మానసిక స్థితిపై ప్రభావం, పెలుసుగా ఉండే గోళ్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Iron Deficiency Remedies: ఇవి తిన్నారంటే ఐరన్ లోప సమస్యలు దూరం..మహిళలూ ఓ లుక్కెయ్యండి
Iron Deficiency
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 29, 2022 | 3:54 PM

ఐరన్ లోపం మహిళలను తీవ్రంగా వేధించే సమస్య. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఐరన్ చాలా అవసరం. ఐరన్ లోపంతో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గి వేరే సమస్యలకు కారణమవుతుంది. మహిళల్లో పిరియడ్స్, గర్భధారణ, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, కొన్ని వైద్య రుగ్మతల వల్ల ఐరన్ లోపం ఏర్పడే అవకాశం ఉంది. ఐరన్ లోపం కారణంగా మగత, శ్వాస ఆడకపోవడం, నాలుక నొప్పి, వాపు, మానసిక స్థితిపై ప్రభావం, పెలుసుగా ఉండే గోళ్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఐరన్ లోపంతో ఇబ్బంది పడే వారు తరచూగా తలనొప్పితో బాధపడతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐరన్ లోపం నుంచి కొన్ని ఆహారాలను తింటే బయటపడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

బీట్ రూట్, క్యారెట్ రసం

తగిన మోతాదులో బీట్ రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఆ మిక్సర్ ను ఒక మెత్తటి గుడ్డలో వేసి గ్లాసులో రసాన్ని వడకట్టాలి. ఇప్పుడు ఆ రసంలో ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి ఉదయాన్నే తాగాలి. నిమ్మరసంలో ఉండే విటమిన్ సీ వల్ల శరీరంలో ఇనుము శోషణ పెరగుతుంది.

మొరింగ ఆకులు

మొరింగ ఆకుల్లో పుష్కలంగా ఐరన్, విటమిన్లు ఏ,సీ మెగ్నీషియం ఉంటుంది. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో మొరింగ ఆకుల పొడిని తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఖర్జూరం, అత్తిపండ్లు, ఎండుద్రాక్షలు

ఈ డ్రైఫూట్స్ వల్ల అధికంగా మెగ్నీషియం, రాగి, విటమిన్లు ఏ, సీ సమృద్ధిగా ఉంటాయి. రాత్రి నానబెట్టి 2-3 ఖర్జూరాలు, 2 అత్తి పండ్లు, ఒక టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షలు అల్పాహారంగా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే తక్షణం శక్తి రావడంతో పాటు శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచుతుంది. 

గోధుమ గడ్డి

ఇది బీటా కెరోటిన్, విటమిన్ కే, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సీ, అనేక బీ విటమిన్లకు అద్భుతమైన మూలాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఒక టేబుల్ స్పూన్ గోధుమ గడ్డి రసం తీసుకుంటే హెచ్ బీ మెరుగవ్వడమే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 

నువ్వుల గింజలు

ఇవి ఐరన్, కాపర్, జింక్, సెలీనియం, విటమిన్ బీ6, ఫోలేట్ తో ఉంటాయి. రోజూ ఒక టేబుల్ స్పూన్ నల్ల నువ్వులను డ్రై రోస్ట్ చేసి ఒక టేబుల్ స్పూన్ తేనె, నెయ్యితో మిక్స్ చేసి లడ్డూలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న లడ్డును రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే ఐరన్ స్థాయి పెరుగుతుంది. 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..