Watch Video: ఉప్పొంగిన మానవత్వం.. బాతుల కోసం నిలిచిపోయిన ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో..

మారుతున్న కాలంతో పాటు మనుషులలో మానవత్వం కూడా కనుమరుగవుతోంది. తోడబుట్టినవారి కష్టాల్లో పాలు పంచుకోవడానికి కూడా ఒకటికి నూటిసార్లు ఆలోచిస్తోంది ప్రస్తుత మానవ సమాజం. అయితే మనుషులలో ఇంకా మానవత్వం చనిపోలేదు, కొనఊపిరితో..

Watch Video: ఉప్పొంగిన మానవత్వం.. బాతుల కోసం నిలిచిపోయిన ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో..
Ducks' Road Crossing
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 03, 2023 | 12:07 PM

మారుతున్న కాలంతో పాటు మనుషులలో మానవత్వం కూడా కనుమరుగవుతోంది. తోడబుట్టినవారి కష్టాల్లో పాలు పంచుకోవడానికి కూడా ఒకటికి నూటిసార్లు ఆలోచిస్తోంది ప్రస్తుత మానవ సమాజం. అయితే మనుషులలో ఇంకా మానవత్వం చనిపోలేదు, కొనఊపిరితో ఇంకా బతికే ఉంది అన్నట్లుగా అడపాదడపా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా చాలానే కనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కోడుతోంది. అది ఒక రోడ్డుపై జరిగిన సంఘటన, ఇంకా ఆ రోడ్డుపై ఉన్న వాహనదారులలో ఉప్పొంగిన మానవత్వాన్ని చూపిన వీడియో.

అసలు ఆ వీడియోలో ఏం జరిగిందంటే.. కొన్ని బాతులు మెయిన్ రోడ్‌ని క్రాస్ చేస్తూ వెళ్తుంటాయి. వీడియో ప్రారంభానికి ముందే ఆగిన కార్లతో పాటు, మరి కొన్ని వాహనాలు కూడా వాటికి అవరోధం కలిగించకుండా ఆగిపోతాయి. ఇలా బాతులు వెళ్తున్నాయని 4 లైన్ల హైవేపై కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక దీనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు సదరు వాహనదారులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మానవత్వం ఇంకా బతికి ఉందనేందుకు ఈ వీడియో ఒక్కటి చాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ వీడియోకు ఇప్పటివరకు 6 లక్షల 34 వేల లైకులు, 59 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..