Viral Video: వామ్మో.! ఎందిరయ్యా ఇదీ.. ఈ పరోటా తింటే సరాసరి యమలోకానికే.. ఇలా కూడా తయారు చేస్తారా?

వినూత్న వంటకాలు రుచి చూసేందుకు భోజన ప్రియులు ఉవ్విళ్లూరుతుంటారు. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోవడంతో..

Viral Video: వామ్మో.! ఎందిరయ్యా ఇదీ.. ఈ పరోటా తింటే సరాసరి యమలోకానికే.. ఇలా కూడా తయారు చేస్తారా?
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: May 03, 2023 | 12:06 PM

వినూత్న వంటకాలు రుచి చూసేందుకు భోజన ప్రియులు ఉవ్విళ్లూరుతుంటారు. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోవడంతో.. చిత్రవిచిత్రమైన రెసిపీలతో కొత్తరకం వంటకాలు తయారు చేస్తూ.. వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు కొందరు. ఇలాంటి నోరూరించే వంటకాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో చూసిన వారెవరైనా కూడా ‘ఆ పరోటా తినడానికి ఒకట్రెండు సార్లు ఆలోచిస్తారని’ అని నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

సాధారణంగా మోతాదుకు తగ్గట్టుగా నెయ్యిని భోజనం వేసుకుని తింటుంటారు. అయితే ఇక్కడొక వ్యక్తి కొంచెం వింతైన వంటకాన్ని ప్రయత్నించాడు. నెయ్యిలో పరోటా కాల్చితే.. ఎలా ఉంటుందో చూపించాడు. ఓ మందపాటి పరోటాను సిద్దం చేసిన అతడు.. ఆపై పెనం మీద మోతాదుకు మించి నెయ్యి పోసి.. దానిలో పరోటాను కాల్చుతాడు. తర్వాత మిగిలిన నెయ్యిని గిన్నెలో పోసి.. చివరికి పరోటాను గట్టిగా అదిమిపెట్టి.. ముక్కలుగా కోసి వడ్డిస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుండగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘వామ్మో! ఇదెక్కడి పరోటా నాయనా’ అంటూ కొందరు.. ‘ఈ పరోటా తింటే రాసరి యమలోకానికే’ అంటూ మరికొందరు.. ‘ఇది సింప్లీ సూపర్బ్ టేస్ట్ ఉంటుందని’ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by Sahi hai (@officialsahihai)