- Telugu News Photo Gallery Uttarakhand Summer Destinations: wants to spend summer within nature, then visit these offbeat places in Uttarakhand
Summer Tour: వేసవిని ప్రకృతి ఒడిలో గడపాలని ప్లాన్ చేస్తున్నారా..? ఈ ప్రదేశాలకు వెళ్లండి.. అక్కడే ఉండిపోవాలనించే కొండలోయల అందాలు..
ఉత్తరాఖండ్ సమ్మర్ టూర్: దేశంలోని చాలా మందికి ఉత్తరాఖండ్ అనగానే చార్‌ధామ్ యాత్ర మాత్రమే గుర్తుకు వస్తుంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ఉత్తరాఖండ్‌లో మహాశివుడే కాదు, ప్రకృతి రూపంలో అందమైన కొండలు, లోయలు ఆ పక్కనే ఉన్న హిమాలయాలు కూడా కొలువై ఉన్నాయి. అందుకే ఉత్తరాఖండ్ ప్రకృతి అందాలను చూసేందుకు సమ్మర్ సరైన సమయం. వేసవిలో కూడా అక్కడ చల్లని వాతావరణం ఉంటుంది. మీరు కనుక ఎన్నటికీ గుర్తుండిపోయే సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఆ రాష్ట్రంలోని ఈ ప్రాంతాలకు నిశ్చింతగా వెళ్లవచ్చు. మరి ఆ పర్యాటక ప్రదేశాలేమిటో ఇప్పుడే చూసేద్దాం..
Updated on: May 03, 2023 | 6:36 AM

ఉత్తరాఖండ్‌లోని ప్రశాంతమైన పర్వతాలు, పచ్చని లోయల అందాలను చూసేందుకు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఇష్టపడతారు. ఇక్కడ అనేక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇందులో నైనిటాల్, ముస్సోరీ, డెహ్రాడూన్ వంటివి ప్రధానంగా ఉన్న కొన్ని పర్యాటక క్షేత్రాలు.అయితే ఇవే కాక ప్రకృతి అందాలను నిండుగా నింపుకున్న మరి కొన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి.

మున్సియారి: మున్సియారి అనేది ఉత్తరాఖండ్‌లోని చాలా ప్రశాంతమైన ప్రదేశం. ఈ ప్రదేశంలోని గ్రీన్ వ్యాలీ, పర్వతాలు, జలపాతాల అందాలు మీ మనసును ఆకర్షిస్తాయి. మీరు ఇక్కడ నుంచే హిమాలయ పర్వతాల ఉత్కంఠభరితమైన దృశ్యాలను ఆరాధించగలరు. మీరు ఢిల్లీ నుంచి నేరుగా ఇక్కడకు వెళ్లవచ్చు. మీరు అక్కడి నుంచి బస్సులో లేదా కారులో కూడా మున్సియారికి వెళ్లవచ్చు.

కనాటల్: ఉత్తరాఖండ్‌లోని ఈ ప్రదేశం చాలా అందమైన, చిన్న హిల్ స్టేషన్. ఇక్కడ నుంచి మీరు విశాల హిమాలయ దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ఇంకా మీకు ఈ కనాటల్‌లోని ఆపిల్ తోటలు, ప్రశాంత వాతావరణం, అందమైన దృశ్యాల అందాలు తెగ నచ్చేస్తాయి.

లోహాఘాట్: ఉత్తరాఖండ్‌లోని లోహాఘాట్ అనేక పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి. ఇంకా ఈ లోహాఘాట్ చుట్టూ దట్టమైన అడవులు ఉన్నాయి. అందుకే ఇది ప్రకృతి ప్రేమికులకు మంచి ప్రదేశమని చెబుతుంటారు. మీరు కూడా ప్రకృతి నిలయంలో వేసవి సమయాన్ని గడపాలంటే ఉత్తరాఖండ్‌లోని ఈ ప్రదేశాన్ని సందర్శించేందుకు మీరు ఒక్కసారి అయినా వెళ్లాలి.

గంగోలిహట్: చాముండ ఆలయం, కాళికా ఆలయం, అంబికా దేవల్ వంటి అద్భుత పర్యాటక ప్రదేశాలను తనలో భాగం చేసుకున్న గంగోలిహట్ ఉత్తరాఖండ్‌లోని పితోరాఘర్ జిల్లాలో ఉంది. ఇంకా మీరు ఇక్కడ ఉత్కంఠభరితమైన హిమాలయ దృశ్యాలతో పాటు, అనేక గుహలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నట్లయితే తప్పక ఉత్తరాఖండ్‌ని ఎంచుకోవచ్చు.





























