- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: lets have a look upon Rematch Chances for Royal Challengers Bangalore vs Lucknow Super Giants
RCB vs LSG Rematch: ధనాధన్ లీగ్‌లో మళ్లీ తలపడబోతున్న బెంగళూరు, లక్నో జట్లు..! ఎప్పుడు, ఎలా అంటే..?
ఐపీఎల్‌లో ముంబై, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ అంటే చూసేందుకు అభిమానులు ఆరాటపడిపోయేవారు. అయితే తాజా ఐపీఎల్ 16వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ తీవ్ర ప్రత్యర్థులుగా మారాయి. మరోవైపు ఇరు జట్లు మళ్లీ ఎప్పుడు తలపడతాయా అని ఐపీఎల్‌లోని అన్నీ టీమ్ల అభిమానులు కూడా గూగుల్‌లో సెర్చ్ చేసేస్తున్నారు...
Updated on: May 03, 2023 | 9:24 AM

ఐపీఎల్‌లో ముంబై, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ అంటే చూసేందుకు అభిమానులు ఆరాటపడిపోయేవారు. అయితే తాజా ఐపీఎల్ 16వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ తీవ్ర ప్రత్యర్థులుగా మారాయి. రెండు మ్యాచ్‌ల్లో దూకుడును చూసి ఇరు జట్ల అభిమానులు ‘మళ్లీ మ్యాచ్ ఎప్పుడు’ అంటూ ఎదురుచూపులు చూస్తున్నారు.

IPL 2023 సీజన్‌లో RCB vs LSG మ్యాచ్ మొదటిసారిగా ఏప్రిల్ 10న జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో 1 వికెట్ తేడాతో విజయం సాధించడంతో ఆర్‌సీబీ అభిమానుల ముందు లక్నో ఆటగాళ్లు దూకుడుగా సంబరాలు చేసుకున్నారు. లక్నో టీమ్ కోచ్ గౌతమ్ గంభీర్ అయితే హోమ్ టీమ్ అభిమానులను నోరు మూసుకోవాలని సైగ కూడా చేశాడు.

దీంతో ఆర్‌సీబీతో పాటు పలు జట్ల అభిమానులు రివెంజ్ కోరుకున్నారు. అంతా ఊహించినట్లుగానే రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌ను ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో విరాట్ కోహ్లీ కూడా తనదైన శైలిలో రివెంజ్ తీర్చుకున్నాడు. అయితే అది కాస్త మ్యాచ్ అనంతరం ‘కోహ్లీ వర్సెస్ గంభీర్’గా మారి ఇద్దరి మధ్య మాటల వాగ్వాదం వరకు వెళ్లింది.

ఈ నేపథ్యంలో ఇరువురికి ఒక మ్యాచ్ ఫీజు కోత కూడా విధించింది బీసీసీఐ. మరోవైపు ఇరు జట్లు మళ్లీ ఎప్పుడు తలపడతాయా అని ఐపీఎల్‌లోని అన్నీ టీమ్ల అభిమానులు కూడా గూగుల్‌లో సెర్చ్ చేసేస్తున్నారు.

కానీ ఈ రెండు జట్లపై ఈ సీజన్‌లో మళ్లీ మ్యాచ్ షెడ్యూల్ లేదు. ఎందుకంటే లీగ్ రౌండ్‌లో ఇదు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరిగాయి. కానీ ఇరు జట్లు మైదానంలో తలపడేందుకు అవకాశం లేకపోలేదు.

అవును, ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో లక్నో టీమ్ 3వ స్థానంలో, ఐదో స్థానంలో ఆర్‌సీబీ ఉన్నాయి. ఇలాగే కొంచెం మెరుగ్గా ఇరు జట్లు ఆడితే రెండు జట్లూ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాయి. అలా కచ్చితంగా ఈ రెండు జట్లు తలపడతాయి. ఇదే కాక క్వాలిఫైయర్లు లేదా ఎలిమినేటర్లు మ్యాచ్‌లలో ఢీకొనవచ్చు.

ఫైనల్‌లోనూ ఇరు జట్లు తలపడే అవకాశం ఉంది. అయితే అంతకంటే ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్‌కు చేరుకోవాల్సి ఉంది. అప్పుడే ఇరు జట్లు తలపడతాయా లేదా అనేది తేలుతుంది.





























