Virat Kohli: ఆడిన 9 మ్యాచ్‌ల్లోనే 3 సార్లు జరిమానా..! ఫైన్ రూపంలో కింగ్ కోహ్లీ ఎంత చెల్లించాడో తెలిస్తే షాక్ కావాల్సిందే..!
IPL 2023, Virat Kohli: ఐపీఎల్ 16వ సీజన్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది తాను ఆడిన 9 మ్యాచ్‌ల్లోనే 5 అర్థసెంచరీలతో పాటు 364 పరుగులు చేశాడు. విశేషమేమిటంటే ఇంతలా రాణిస్తున్న కోహ్లీ ఈ 9 మ్యాచ్‌ల్లోనే 3 సార్లు జరిమానా కట్టాడు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో..
IPL 2023, Virat Kohli: ఐపీఎల్ 16వ సీజన్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది తాను ఆడిన 9 మ్యాచ్‌ల్లోనే 5 అర్థసెంచరీలతో పాటు 364 పరుగులు చేశాడు. విశేషమేమిటంటే ఇంతలా రాణిస్తున్న కింగ్ కోహ్లీ ఈ 9 మ్యాచ్‌ల్లోనే 3 సార్లు జరిమానా కట్టాడు. ఇక దీనికి సంబంధించిన లెక్కలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళికి సంబంధించిన లెవల్-2 ఉల్లంఘించాడని.. విరాట్ కోహ్లీకి మ్యాచ్‌లో 100% జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్‌తో కోహ్లికి మైదానంలో వాగ్వాదం జరిగింది. ఇందుకు గానూ కోహ్లీకి 1.07 కోట్లు జరిమానా విధించారు.
అలాగే అంతకమందు ఏప్రిల్ 17న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. ఈ రకమైన వేడుకలు IPL ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం లెవల్ 1 నేరం. ఆ కాణంగానే విరాట్ కోహ్లీకి అప్పుడు 12 లక్షలు జరిమానా విధించారు. ఆ తర్వాత ఏప్రిల్ 23 న జరిగిన రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ స్లో ఓవర్ రేట్‌కు కూడా జరిమానా శిక్ష అనుభవించాడు. ఈ మ్యాచ్‌లో తాత్కాలిక కెప్టెన్‌గా కనిపించిన విరాట్ కోహ్లీ నిర్ణీత సమయంలోగా 20 ఓవర్లు పూర్తి చేయలేకపోయాడు. ఫలితంగా ఐపీఎల్ కనీస ఓవర్ రేట్ నేరాల కింద కింగ్ కోహ్లీకి 24 లక్షలు జరిమానా విధించారు. ఇలా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడంటూ.. కోహ్లీపై ఇప్పటికే 1 కోటి 43 లక్షల రూపాయల జరిమానా విధించారు. ఈ మొత్తంతో కనీసం 5 మంది ఐపీఎల్ ప్లేయర్లను కొనుగోలు చేయగలగడం సాధ్యమవుతుంది.
కాగా, ఈ ఐపీఎల్ సీజన్‌లో జరిమానా రూపంలో విరాట్ కోహ్లీ మొత్తం.. RCB జట్టులోని ఇతర ఆటగాళ్లపై పడిన ఫైన్ కంటే చాలా ఎక్కువ. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఆర్‌సీబీ తరఫున ఆడుతున్న మహిపాల్ లోమ్రార్(రూ. 95 లక్షలు), సుయాష్ ప్రభుదేశాయ్(రూ. 30 లక్షలు), కర్ణ్ శర్మ(రూ. 50 లక్షలు), ఫిన్ అలెన్(రూ. 80 లక్షలు), సిద్ధార్థ్ కౌల్(రూ. 75 లక్షలు) ఇంకా మరికొందరు ఆటగాళ్లు తమకు ఇచ్చే దానికంటే ఎక్కువ చెల్లించారు.