IPL 2023: వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. నవీన్‌తో ఆమాత్రం ఉంటది.. కెరీర్ అంతా గొడవలే..

LSG vs RCB: ఐపీఎల్ 16వ సీజన్‌లో 43వ లీగ్ మ్యాచ్ గురించి చర్చ గత 24 గంటల్లో ఎక్కువగా కనిపించింది. విరాట్ కోహ్లి వర్సెస్ గౌతమ్ గంభీర్ మధ్య మ్యాచ్ తర్వాత తీవ్ర చర్చ జరిగింది. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాడు నవీన్-ఉల్-హక్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనదిగా మారింది.

IPL 2023: వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. నవీన్‌తో ఆమాత్రం ఉంటది.. కెరీర్ అంతా గొడవలే..
ఐపీఎల్‌లో ముంబై, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ అంటే చూసేందుకు అభిమానులు ఆరాటపడిపోయేవారు. అయితే తాజా ఐపీఎల్ 16వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ తీవ్ర ప్రత్యర్థులుగా మారాయి. రెండు మ్యాచ్‌ల్లో దూకుడును చూసి ఇరు జట్ల అభిమానులు ‘మళ్లీ మ్యాచ్ ఎప్పుడు’ అంటూ ఎదురుచూపులు చూస్తున్నారు.
Follow us
Venkata Chari

|

Updated on: May 02, 2023 | 10:01 PM

Naveen-ul-Haq Heated Argument: ఐపీఎల్ 16వ సీజన్‌లో 43వ లీగ్ మ్యాచ్ గురించి చర్చ గత 24 గంటల్లో ఎక్కువగా కనిపించింది. విరాట్ కోహ్లి వర్సెస్ గౌతమ్ గంభీర్ మధ్య మ్యాచ్ తర్వాత తీవ్ర చర్చ జరిగింది. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాడు నవీన్-ఉల్-హక్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనదిగా మారింది. లక్నో సూపర్ జెయింట్ లక్ష్యాన్ని చేధిస్తున్న సమయంలో కోహ్లి, నవీన్ మధ్య వాగ్వాదం జరిగింది.

మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ నవీన్-ఉల్-హక్ ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు వివిధ టీ20 లీగ్‌లలో, నవీన్ మ్యాచ్ సమయంలో మహ్మద్ అమీర్, షాహిద్ అఫ్రిది వంటి సీనియర్ ఆటగాళ్లతో తలపడ్డాడు.

ఇవి కూడా చదవండి

నవీన్-ఉల్-హక్ 2016 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టులో భాగంగా ఉన్నాడు. 2020లో ఆడిన లంక ప్రీమియర్ లీగ్ (LPL)లో మాజీ పాకిస్థానీ వెటరన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిదితో, మహ్మద్ అమీర్‌తో గొడవ పడినప్పుడు నవీన్ వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత పలు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

బిగ్ బాష్ లీగ్ లోనూ ఓ ఆస్ట్రేలియా ఆటగాడితో నవీన్ వాగ్వాదం..

ఆస్ట్రేలియా టీ20 లీగ్ బిగ్ బాష్ లీగ్‌లో, నవీన్-ఉల్-హక్ కూడా ఇదే విధంగా మైదానంలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం కనిపించింది. 2022లో ఆడిన బిగ్ బాష్ లీగ్ సీజన్‌లో, ఆస్ట్రేలియా ఆటగాడు డి’ఆర్సీ షార్ట్‌తో వాదిస్తూ కనిపించాడు. అలాగే 2023 సంవత్సరంలోనే లంక ప్రీమియర్ లీగ్ సీజన్‌లో నవీన్ మైదానంలో తిసారా పెరీరాతో వాదిస్తూ కనిపించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..