IPL 2023: ఢిల్లీ బ్యాటర్లను చూసి సిగ్గుతో తలదించుకున్న హార్దిక్.. ఎందుకంటే?
GT VS DC: ఐపీఎల్ 2023 44వ మ్యాచ్‌లో ఓ వైపు ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్లను మహమ్మద్ షమీ పడగొడుతుంటే, మరోవైపు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముఖం దాచుకుంటున్నాడు. ఇలా ఎందుకు జరిగింది? ఇంత గొప్ప ప్రదర్శన చేసినా గుజరాత్ కెప్టెన్ ఎందుకు సిగ్గుపడ్డాడు?
ఐపీఎల్ 2023 44వ మ్యాచ్‌లో ఓ వైపు ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్లను మహమ్మద్ షమీ పడగొడుతుంటే, మరోవైపు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముఖం దాచుకుంటున్నాడు. ఇలా ఎందుకు జరిగింది? ఇంత గొప్ప ప్రదర్శన చేసినా గుజరాత్ కెప్టెన్ ఎందుకు సిగ్గుపడ్డాడు? అనే విషయం నెట్టింట్లో ఆసక్తిని రేకిత్తించింది. హార్దిక్ పాండ్యా ముఖం దాచుకోవడానికి కారణం ఢిల్లీపై మహ్మద్ షమీ బౌలింగ్. ఢిల్లీ క్యాపిటల్స్‌పై మహ్మద్ షమీ 4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ 5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయినప్పుడు హార్దిక్ పాండ్యా ముఖం దాచుకున్నాడు. ప్రియాం గార్గ్‌ని షమీ అవుట్ చేసిన వెంటనే హార్దిక్ తన నోటిని చేతులతో మూసుకున్నాడు. ఢిల్లీ వికెట్లు ఇలా పేకమేడలా కూలిపోతుంటే హార్దిక్ నమ్మలేకపోయాడు. దీంతో ఇదేం ఆటరా బాబూ అనుకుంటూ ఇలా చేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
షమీ విధ్వంసం..
ఢిల్లీపై మహ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్‌ను ప్రదర్శించాడు. ఈ ఆటగాడు మొదటి బంతికే ఫిల్ సాల్ట్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత, షమీ తన స్వింగ్, సీమ్‌తో రూసో, మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్ తక్కువ సమయంలోనే పెవిలియన్ చేర్చాడు. షమీ 24 బంతుల్లో 19 బాల్స్‌కు పరుగులేమీ ఇవ్వలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..