AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: కోహ్లీకా మజాకా, ఎక్కడా తగ్గేదేలే.. ! ఫైన్ కట్టిన గంటల్లోనే కింగ్ కోహ్లీ ఖాతాలోకి 9 కోట్లు.. ఎలా అంటే..?

IPL 2023,Virat Kohli: ఎవరేం అనుకున్నా ఎక్కడా తగ్గేదేలే అంటున్నాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. మే 1న జరిమానా రూపంలో కోటి రూపాయలు పోగొట్టుకున్న కోహ్లీ ఆ మరుసరి రోజే రూ.9 కోట్లను ఖాతాలో వేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. లక్నో సూపర్ జెయింట్స్‌తో..

Virat Kohli: కోహ్లీకా మజాకా, ఎక్కడా తగ్గేదేలే.. ! ఫైన్ కట్టిన గంటల్లోనే కింగ్ కోహ్లీ ఖాతాలోకి 9 కోట్లు.. ఎలా అంటే..?
Virat Kohli And Great Learning Ad
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 03, 2023 | 8:23 AM

Share

IPL 2023,Virat Kohli: ఎవరేం అనుకున్నా ఎక్కడా తగ్గేదేలే అంటున్నాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. మే 1న జరిమానా రూపంలో కోటి రూపాయలు పోగొట్టుకున్న కోహ్లీ ఆ మరుసరి రోజే రూ.9 కోట్లను ఖాతాలో వేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం విరాట్‌ కోహ్లీ, గౌతమ్‌ గంభీర్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఇద్దరికీ ఆ మ్యాచ్ ఫీజులో 100% జరిమానా విధించారు ఐపీఎల్ అధికారులు. తద్వారా కోహ్లీ తన ఖాతా నుంచి రూ.1.07 కోట్ల రూపాయలను ఫైన్ రూపంలో చెల్లించాడు.

అయితే ఆ కోటి రూపాయలు పోతే పోయాయి అనుకున్న కోహ్లీ ఆ వాగ్వాదాన్ని అక్కడే వదిలేసి.. మరుసటి రోజు(మే 2)న తన ఇన్‌స్టా నుంచి ఓ పోస్ట్ పెట్టాడు. ‘గ్రేట్ లెర్నింగ్’ అధికారిక ప్రకటన వీడియోను ఇలా తన ఇన్‌స్టా నుంచి షేర్ చేసిన కోహ్లీ ఏకంగా రూ.8.9 కోట్లు అందుకున్నాడు. అంటే జరిమానలో ఎంత అయితే పోయిందో అంతను 8 రెట్ల సొమ్మును జేబులో వేసుకున్నాడు కింగ్ కోహ్లీ.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

కాగా, ఆ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ 30 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఇంకా ఈ సీజన్‌లో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన కింగ్ కోహ్లీ 5 అర్థశతకాలతో సహా 364 పరుగులు చేశాడు. ఇదిలా ఉండగా కోహ్లీ మరో 12 పరుగులు చేస్తే ఐపీఎల్‌‌లో 7000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా అవతరిస్తాడు. అదే కాక ఒకే టీమ్(ఆర్‌సీబీ) తరఫున 7 వేల రన్స్ చేసిన ఆటగాడిగా కూడా చరిత్ర సృష్టిస్తాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వర్షాకాలంలో ఈ కూరగాయలు, పండ్లు ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకండి!
వర్షాకాలంలో ఈ కూరగాయలు, పండ్లు ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకండి!
టాస్‌తోనే టీమిండియా కొంపముంచుతోన్న శ్రేయాస్ అయ్యర్..!
టాస్‌తోనే టీమిండియా కొంపముంచుతోన్న శ్రేయాస్ అయ్యర్..!
సబ్జా సీడ్స్ vs చియా సీడ్స్.. వానాకాలంలో మీ కడుపుకు ఏది మంచిది..?
సబ్జా సీడ్స్ vs చియా సీడ్స్.. వానాకాలంలో మీ కడుపుకు ఏది మంచిది..?
రిస్క్ లేని పెట్టుబడి..15 ఏళ్లలో రూ.32 లక్షలకు పైగా మీ చేతిలో..
రిస్క్ లేని పెట్టుబడి..15 ఏళ్లలో రూ.32 లక్షలకు పైగా మీ చేతిలో..
ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి!
ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి!
ఆషాఢ మాసంలో తులసి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం.. కానీ ఈ తప్పులు..
ఆషాఢ మాసంలో తులసి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం.. కానీ ఈ తప్పులు..
ఆస్పత్రిలో వరుస హత్యలు.. ఒకేసారి 5 ఓటీటీల్లోకి క్రైమ్ థ్రిల్లర్
ఆస్పత్రిలో వరుస హత్యలు.. ఒకేసారి 5 ఓటీటీల్లోకి క్రైమ్ థ్రిల్లర్
టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా..!
టీమిండియా హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డు.. పరువు తీసేశావుగా..!
మూడో రోజు పతనమైన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు!
మూడో రోజు పతనమైన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు!
Horoscope Today: 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు
Horoscope Today: 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు