Andhra Pradesh: బ్రహ్మనందం సహా పలువురికి ‘కోడెల విశిష్ట పురస్కారం’.. అందజేసిన మాజీ ఉపరాష్ట్రపతి..

నవ్యాంధ్ర తొలి స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు 75వ జయంతిని పురస్కరించుకుని.. ‘కోడెల మిత్రమండలి’ ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులకు విశిష్ట సేవా పురస్కారాలను ప్రధానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా..

Andhra Pradesh: బ్రహ్మనందం సహా పలువురికి ‘కోడెల విశిష్ట పురస్కారం’.. అందజేసిన మాజీ ఉపరాష్ట్రపతి..
Venkaiah Naidu Presenting Kodela Award To Brahmanandam
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 03, 2023 | 7:34 AM

నవ్యాంధ్ర తొలి స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు 75వ జయంతిని పురస్కరించుకుని.. ‘కోడెల మిత్రమండలి’ ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులకు విశిష్ట సేవా పురస్కారాలను ప్రధానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డులను అందజేయడం విశేషం. కోడెల శివప్రసాదరావు విశిష్ఠ సేవా పురస్కారాల కార్యక్రమానికి గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ హాలు వేదికైంది. కోడెల శివప్రసాద్‌ 75వ జయంతి వేడుకల్లో భాగంగా పలువురు ప్రముఖులకు ఈ పురస్కారాలు అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్‌ అందజేసి ఎంతోమంది ప్రాణాలు నిలిపిన భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుచిత్ర ఎల్ల విశిష్ఠ సేవా పురస్కారాలకు ఎంపిక అయ్యారు.

గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్‌ గోపాలకృష్ణ గోఖలే, సినీనటులు డాక్టర్‌ బ్రహ్మానందం ఈ విశిష్ఠ సేవా పురస్కారాలు అందుకున్నారు. కోడెల కుటుంబ సభ్యులు కూడా హాజరైన ఈ కార్యక్రమంలో కోడెల శివరాం మాట్లాడుతూ. సమాజానికి మంచి చేయాలని కోడెల నిరంతరం తపించారని అన్నారు. సామాజిక సేవల్లో రెండు గిన్నిస్ రికార్డులు సాధించారని గుర్తు చేశారు. సినీ హాస్య నటులు బ్రహ్మానందం కోడెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పదవులు ఉన్నా లేకపోయినా సామాన్యునిగా జీవించారని తెలిపారు. కోడెల విశిష్ట సేవా పురస్కారం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు బ్రహ్మానందం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..