YS Jagan: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల.. ఇవాళే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సీఎం జగన్ అంకురార్పణ..

ఎన్నో ఏళ్ల ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారం కాబోతోంది. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు ఇవాళ శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం జగన్. విజయనగరం జిల్లాలో 3,500 కోట్ల ఖర్చుతో 2,200 ఎకరాల్లో ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును నిర్మించబోతోంది.

YS Jagan: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల.. ఇవాళే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సీఎం జగన్ అంకురార్పణ..
Ys Jagan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 03, 2023 | 10:40 AM

ఎన్నో ఏళ్ల ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారం కాబోతోంది. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు ఇవాళ శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం జగన్. విజయనగరం జిల్లాలో 3,500 కోట్ల ఖర్చుతో 2,200 ఎకరాల్లో ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును నిర్మించబోతోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ భోగాపురం అంత‌ర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ పనులకు ఇవాళ అంకురార్పణ చేయనున్నారు సీఎం జగన్‌. ముందుగా పైలాన్‌ ప్రారంభించి, ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. దీంతోపాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో కూడా పర్యటించనున్నారు. అదానీ డేటా సెంటర్‌, టెక్నాలజీ, బిజినెస్ పార్క్‌లకు శంకుస్థాపన చేస్తారు. మధురవాడలో 130 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్న ఈ పార్క్‌లో అదానీ సంస్థ 14,634 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతోపాటు తారకరామ తీర్ధ సాగరం పనులకు రూ.194.40 కోట్లతో శంకుస్థాపన, 23.73 కోట్లతో చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఉదయాన్నే తాడేపల్లి నుంచి బయల్దేరి భోగాపురం వెళ్లనున్నారు.

అయితే.. భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రతిపాదించిన ఘనత తమదేనంటోంది తెలుగుదేశం పార్టీ. కానీ.. పెళ్లి కార్డ్ వెయ్యగానే పెళ్లయిపోయినట్టు కాదంటూ వైసీపీ కౌంటర్‌ ఇస్తోంది. దీంతో టీడీపీకి కౌంటర్‌ ఇచ్చారు మంత్రి అమర్‌నాథ్‌. 2019 ఎన్ని్కల స్టంట్‌లో భాగంగానే చంద్రబాబు హడావిడిగా.. అనుమతులు లేకుండానే శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు అమర్‌నాథ్. ఇక.. గత ప్రభుత్వాలు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని మోసం చేశాయన్నారు విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. మొత్తంగా.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఇవాళ సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో వైసీపీ-టీడీపీ మధ్య వార్‌ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం