CM YS Jagan: ‘జాబ్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర’.. పలు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. పూర్తి వివరాలివే..

ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పలు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌, అదానీ డేటా సెంటర్‌, అలాగే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు పునాది..

CM YS Jagan: ‘జాబ్‌ హబ్‌గా ఉత్తరాంధ్ర’.. పలు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. పూర్తి వివరాలివే..
Cm Jagan Speech In Bhogapuram
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 03, 2023 | 11:58 AM

ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పలు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌, అదానీ డేటా సెంటర్‌, అలాగే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు పునాది రాళ్లు వేశారు. అనంతరం విజయనగరం భోగాపురం మండలం సవరవిల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. ఈ క్రమంలో రానున్న కాలంలో ఉత్తరాంధ్రుల కోసం తీసుకురానున్న అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాల గురించి చెప్పారు.

సభలో మాట్లాడుతూ ‘అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యం.  వెనుకబడిన ఉత్తరాంధ్రా అభివృద్ధికి కట్టుబడే ఉన్నాం. ఇటీవలే మూలపేటలో శంకుస్థాపన చేసిన ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుంది. తారకరామ తీర్థ సాగర ప్రాజెక్ట్‌ పనులకు శంకుస్థాపన చేయనున్నాం. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్‌ హబ్‌గా మారనుంది’ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇంకా చింతపల్లిలో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌, అదానీ డేటా సెంటర్‌, భోగాపురం ఎయిరోపోర్టుకు శంకుస్థాపన చేశామని, ఇందుకు ఎంతో చిత్తశుద్ధితో పనిచేశామని తెలిపారు. 2026 నాటికి రెండు రన్‌వేలతో ప్రాజెక్ట్‌ ఎయిరోపోర్టు టేక్‌ ఆఫ్‌ అవుతుందని, రూ. 23.73కోట్లతో చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..