Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs MI: ‘రోహిత్ 6 టోర్నీల విన్నర్.. గౌరవించడం నేర్చుకో’.. ‘పంజాబ్ కింగ్స్‌’కి దిమ్మతిరిగే రిప్లై.. అసలేం జరిగిందంటే..?

PBKS vs MI: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మపై పంజాబ్ కింగ్స్ చేసిన ఓ ట్వీట్ నెట్టింట..

PBKS vs MI: ‘రోహిత్ 6 టోర్నీల విన్నర్.. గౌరవించడం నేర్చుకో’.. ‘పంజాబ్ కింగ్స్‌’కి దిమ్మతిరిగే రిప్లై.. అసలేం జరిగిందంటే..?
Pbks Vs Mi
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 04, 2023 | 4:32 PM

PBKS vs MI: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మపై పంజాబ్ కింగ్స్ టీమ్ అడ్మిన్ చేసిన ఓ ట్వీట్ నెట్టింట తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కూడా అద్దిరపోయేలా రిప్లై ఇచ్చింది. అసలేం జరిగిందంటే.. పంజాబ్ కింగ్స్ ఇచ్చిన 215 పరుగులు భారీ టార్గెట్‌ని చేధించేందుకు ముంబై బ్యాటర్లు క్రీజులోకి వచ్చారు. అయితే టీమ్ ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ రోహిత్ మూడో బంతికే డకౌట్ అయి వెనుదిరగాడు. రోహిత్ ఔట్ అయిన ఫోటోను షేర్ చేస్తూ ‘R0️⃣➡️DA1️⃣ ’ అంటూ ట్వీట్ చేసి అత్యుత్సాహం ప్రదర్శించింది పంజాబ్ కింగ్స్.

అయితే రోహిత్ శర్మను వెక్కిరిస్తూ పంజాబ్ కింగ్స్ చేసిన ట్వీట్‌ ముంబై ఇండియన్స్ కంట పడింది. వెంటనే ముంబై టీమ్ ‘రోహిత్ శర్మ ఒక్కడే 6 ఐపీఎల్ ట్రోఫీలను అందుకున్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కానీ, పంజాబ్ కింగ్స్ కానీ ఒక్కటీ గెలవలేకపోయింది. గౌరవించడం నేర్చుకో’ అన్నట్లుగా దిమ్మదిరిగే రిప్లై ఇచ్చిది. మరోవైపు క్రికెట్ అభిమానులు కూడా పంజాబ్ కింగ్స్ ట్వీట్‌పై మండిపడుతున్నారు. అంతే.. పంజాబ్ కింగ్స్ టీమ్ అడ్మిన్ తన ట్వీట్‌ని వెంటనే డిలీట్ చేశారు. అయినప్పటికీ ఆ ట్వీట్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన గెలవడంతో పంజాబ్ కింగ్స్ ట్విట్టర్ అడ్మిన్‌కి చెంపదెబ్బ తగిలినట్లయింది.

ఇవి కూడా చదవండి
Pbks Twitter Handle Tweet

రోహిత్ శర్మ ఔట్ అయిన తర్వాత పంజాబ్ కింగ్స్ చేసిన ట్వీట్ (స్క్రీన్‌షాట్)

కాగా, ఐపీఎల్ చరిత్రలో 6 సార్లు ఐపీఎల్ ట్రోపీ గెలుచుకున్న ఆటగాడిగా, 5 సార్లు టోర్నీలో విజేతగా నిలిచిన కెప్టెన్‌గా రోహిత్ శర్మకు రికార్డ్ ఉంది. 2009 ఐపీఎల్ సీజన్ విన్నర్ డెక్కన్ చార్జర్స్ టీమ్‌లో రోహిత్ శర్మ కూడా సభ్యుడు. అలాగే రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ముంబై ఇండియన్స్ 5 సార్లు ఐపీఎల్ టోర్నీ విజేతగా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..