AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala Darshan: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు దొరకలేదా..? టీటీడీ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఈ విధానంలోనూ దర్శనం..

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి టీటీడీ మంచి అవకాశం కల్పిస్తోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో దొరకని వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. అదే తిరుమల దివ్యానుగ్రహ హోమం టికెట్లు. ఈ టికెట్ల ద్వారా ఎలా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు అనేది చూద్దాం.

Tirumala Darshan: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు దొరకలేదా..? టీటీడీ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఈ విధానంలోనూ దర్శనం..
Tirumala
Venkatrao Lella
|

Updated on: Feb 23, 2026 | 7:51 PM

Share

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. శ్రీవారి దర్శనంకు సంబంధించి మరో అవకాశం కల్పిస్తోంది. శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ఇప్పుడే అనేక రకాల టికెట్లు, సేవలు అందుబాటులో ఉన్నాయి. ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300, దివ్య దర్శనం, సర్వదర్శనం, సుపథం, టైం స్లాట్ టోకెన్స్, లక్కీ డిప్ వంటి టికెట్ల ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఇక రూ.300 టికెట్లు, లక్కీ డిప్ వంటి టికెట్లను ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేస్తుంది. అయితే ఆన్‌లైన్‌లో కొన్ని నిమిషాల్లోనే టికెట్లు ఖాళీ అవుతాయి. అయితే టికెట్లు దొరకనివారు మరో రకంగా శ్రీవారిని దర్శించుకోవచ్చు.

ఫిబ్రవరి 25న టికెట్లు

తిరుమల శ్రీవారిని మరో రకంగా కూడా టికెట్ తీసుకుని దర్శించుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. కానీ చాలామందికి ఈ విషయం తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. అదే తిరుమల దివ్యానుగ్రహ హోమం. మార్చి నెలకు సంబంధించి ఈ సేవల టికెట్లను ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేస్తోంది. టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఈ టికెట్లను కొనుగోలు చేసి శ్రీవారిని దర్శించుకోవచ్చు. అలిపిరిలోని సప్తగోప్రదక్షిణ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం జరుగుతోంది. ఇందులో పాల్గొన్నవారికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారు. ఇక టికెట్ కింద ఇద్దరు దర్శనానికి వెళ్లవచ్చు. హోమం జరిగిన రోజే మధ్యాహ్నం 3 గంటలకు దర్శనం టీటీడీ కల్పిస్తోంది.

టికెట్ ధర ఎంతంటే..?

దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ ధర రూ.1600గా టీటీడీ నిర్ణయించింది. మొత్తం 200 టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేస్తారు. హోమం ముగిసిన అనంతరం అదే టికెట్‌పై ఇద్దరికి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు దొరకని వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. టీటీడీ కల్పిస్తున్న ఈ అవకాశం గురించి చాలామందికి అవగాహన లేక ఉపయోగించుకోలేకపోతున్నారు.  దీంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.

Follow Us
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఈ విధానంలోనూ దర్శనం
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఈ విధానంలోనూ దర్శనం
ఫస్ట్ సినిమా అట్టర్ ప్లాప్.. అయినా క్యూ కట్టిన ఛాన్సులు..
ఫస్ట్ సినిమా అట్టర్ ప్లాప్.. అయినా క్యూ కట్టిన ఛాన్సులు..
స్ట్రీట్ ఫుడ్ అంటే భయమా? ఇవి తింటే మీ గుండె ఆరోగ్యం పదిలం..
స్ట్రీట్ ఫుడ్ అంటే భయమా? ఇవి తింటే మీ గుండె ఆరోగ్యం పదిలం..
నగరాభివృద్ధికి 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన దాత
నగరాభివృద్ధికి 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన దాత
వందే భారత్‌ కలర్‌ ముద్రతో రూ.100 కాయిన్‌!
వందే భారత్‌ కలర్‌ ముద్రతో రూ.100 కాయిన్‌!
ఎయిర్‌పోర్ట్‌లో హార్దిక్, మహిక సందడి...నలుగురిలో ఏంటి భయ్యా ఇది
ఎయిర్‌పోర్ట్‌లో హార్దిక్, మహిక సందడి...నలుగురిలో ఏంటి భయ్యా ఇది
ఖరీదైన హెయిర్ డైలు వద్దు.. ఇలా సింపుల్‌గా తెల్ల జుట్టుకు చెక్‌
ఖరీదైన హెయిర్ డైలు వద్దు.. ఇలా సింపుల్‌గా తెల్ల జుట్టుకు చెక్‌
ఇతడి ట్రిక్ తెలిస్తే సెకన్లలో పూరీలు రెడీ.. వైరల్ వీడియో..
ఇతడి ట్రిక్ తెలిస్తే సెకన్లలో పూరీలు రెడీ.. వైరల్ వీడియో..
ఈ చిన్న పని చేయకపోతే పీఎం కిసాన్ కట్.. కేంద్రం కొత్త రూల్
ఈ చిన్న పని చేయకపోతే పీఎం కిసాన్ కట్.. కేంద్రం కొత్త రూల్
డైరెక్టర్‌గా మరో జబర్దస్త్ కమెడియన్! ఇక టీవీ షోకు గుడ్‌ బై!
డైరెక్టర్‌గా మరో జబర్దస్త్ కమెడియన్! ఇక టీవీ షోకు గుడ్‌ బై!