Mars Transit 2023: ఈ రాశులకు ‘దారిద్య్ర యోగం’.. జాగ్రత్త పడకపోతే ఆర్థిక, ఆరోగ్య నష్టం.. మీ రాశి ఉందేమో ముందుగానే చూసుకోండి..
Mars Transit 2023: జ్యోతిష్య శాస్తంలో కుజుడిని అంత్యంత ప్రతికూలమైన గ్రహం భావిస్తారు. ఆంగారకుడిగా కూడా పేరొందిన కుజుగా ధైర్యానికి కారకుడు. అయితే కుజుడి స్థితిగతులు రాశిచక్రంలోని 12 రాశులపై కూడా ప్రభావితం చేస్తుంటాయి. ఈ క్రమంలో కుజుడు..
Mars Transit 2023: జ్యోతిష్య శాస్తంలో కుజుడిని అంత్యంత ప్రతికూలమైన గ్రహం భావిస్తారు. ఆంగారకుడిగా కూడా పేరొందిన కుజుగా ధైర్యానికి కారకుడు. అయితే కుజుడి స్థితిగతులు రాశిచక్రంలోని 12 రాశులపై కూడా ప్రభావితం చేస్తుంటాయి. ఈ క్రమంలో కుజుడు ఈ నెల 10న కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఫలితంగా దారిద్య్రయోగం అనే అశుభయోగం ఏర్పడబోతుంది. కర్కాటకంలో కుజుడు బలహీనంగా ఉండడమే అందుకు కారణం. ఇక ఈ క్రమంలో కొన్ని రాశులవారు తీవ్రంగా నష్టపోతారు. ఇంకా పెను మార్పులు చోటుచేసుకుంటాయి. మరి దారిద్య్రయోగం సమయంలో ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో మనం ఇప్పుడు చూద్దాం..
మిధునరాశి: కర్కాటక రాశిలో కుజ గ్రహ సంచారం వల్ల మిధునరాశివారికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ దారిద్య్రయోగం సమయంలో మిమ్మల్ని ఆర్థిక, ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఇంకా ఆదాయం తక్కువగా, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో నష్టం, శత్రువులతో ప్రమాదం పొంచి ఉన్నందున కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది.
మకరరాశి: మకరరాశివారికి కూడా ఈ దారిద్య్రయోగం అశుభకరం. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో పాటు దాంపత్య జీవితంలో గొడవలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు మోసపోయే ప్రమాదం ఉన్నందును ఒకరిని నమ్మే ముందు తప్పనిసరిగా ఆలోచించండి.
మీనరాశి: కర్కాటక రాశిలో కుజ సంచరించడం మీన రాశి వారికి కష్టాలను తెచ్చిపెడుతుంది. దరిద్ర యోగం వల్ల మీరు మానసిక వేదన, ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాసం ఉంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దలతో చర్చించడం మంచిది.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..