Horoscope Today: ఆ రాశివారు ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు..! 12 రాశులకు గురువారం రాశిఫలాలు..

Horoscope Today: తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందని ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి గురువారం (04 మే 2023).. రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

Horoscope Today: ఆ రాశివారు ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు..! 12 రాశులకు గురువారం రాశిఫలాలు..
Horoscope Today 4th April 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Shaik Madar Saheb

Updated on: May 04, 2023 | 6:23 AM

Horoscope Today: తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందని ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి గురువారం (04 మే 2023).. రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగ జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు మంచి సంస్థలు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. ఆలయాలు సందర్శిస్తారు. పిల్లల వల్ల సంతోషం పొందుతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఊహించని విధంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా ముందుకు సాగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. బంధువుల రాకతో కుటుంబంలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. సంతానయోగ సూచనలున్నాయి. రెండవ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది కానీ అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. రుణ సమస్యలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసు ఒకటి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. పిల్లలు చదువులోనూ, ఉద్యోగ ప్రయత్నాలలోనూ విజయం సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆచితూచి మాట్లాడండి. కొన్ని ముఖ్యమైన పనులు బాగా ఆలస్యం కావచ్చు.స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి నిపుణులకు, ఉద్యోగులకు, వ్యాపారులకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భాగస్వాములతో ప్రధాన సమస్యలను పరిష్కరించుకుంటారు. కొందరు స్నేహితులు అపార్ధాలతో దూరమయ్యే అవకాశం ఉంది. కొంచెం సహనంతో వ్యవహరిస్తే మీ లక్ష్యాలు నెరవేరే సూచనలు ఉన్నాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రుణ సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. లాయర్లకు, డాక్టర్లకు, ఐటీ నిపుణులకు అనుకూల సమయం. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు.
  7. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. ఒకటి రెండు కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. అయితే, ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. అనవసర ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. డబ్బు నష్టం జరుగుతుంది. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. సామాజిక సేవా రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్నేహితుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు.
  8. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల కొన్ని వ్యక్తిగత విషయాల్లో ఇబ్బందులు పడతారు. వివాహ ప్రయత్నాలు కాస్తంత అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో అధికారులు, సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. వ్యక్తిగత జీవితం మీద బాగా ఒత్తిడి ఉంటుంది.
  9. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల కొద్దిగా నష్టపోతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగపరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతానం లేని వారు సంతాన యోగానికి సంబంధించితీపి కబురు అందుకుంటారు. ఉద్యోగులకు అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. సన్నిహితులను ఆర్థికంగా ఆదుకుంటారు.
  10. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): మొండి బాకీ ఒకటి అనుకోకుండా వసూలు అవుతుంది. చాలా కాలంగా పీడిస్తున్న ఓ వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. అదనపు సంపాదనకు సమయం అనుకూలంగా ఉంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక రంగాల్లో ఉన్నవారు బాగా బిజీ అవుతారు. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు చికాకు పెడుతుంది.
  11. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. బంధుమిత్రులలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంపాదన స్థిరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి, తిప్పట ఎక్కువగా ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. విదేశాల నుంచి ఆశించిన కబురు అందుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.
  12. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఇబ్బందుల్లో ఉన్న బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా అనారోగ్యంతో అవస్థ పడే సూచనలున్నాయి. ఎంతో శ్రమ మీద ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నాలు చాలావరకు అనుకూలిస్తాయి. మిత్రుల వల్ల చిక్కుల్లో పడతారు. అతి ముఖ్యమైన కోర్టు కేసు ఒకటి వాయిదా పడుతుంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళవు. ఆర్థిక లావాదేవీలు లాభంచకపోవచ్చు.
  13. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రాశి వారికి కొద్దిగా అదృష్టం కలిసి వస్తుంది. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెంచుకునేందుకు ఆలోచన చేస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలగజేస్తుంది. టీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..