Zodiac Signs: ఆ మూడు రాశుల వారికి ‘ మహా భాగ్యం ‘.. చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు..!

జ్యోతిష్య శాస్త్రంలో తొమ్మిదవ స్థానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. తొమ్మిదో స్థానాన్ని భాగ్య స్థానం అని కూడా అంటారు. అంటే హౌస్ ఆఫ్ లక్ అన్నమాట. జాతక చక్రంలో ఈ తొమ్మిదవ స్థానం బలంగా ఉన్నవారు జీవితంలో తప్పకుండా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.

Zodiac Signs: ఆ మూడు రాశుల వారికి ' మహా భాగ్యం '.. చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు..!
Zodiac Signs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 02, 2023 | 6:54 PM

జ్యోతిష్య శాస్త్రంలో తొమ్మిదవ స్థానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. తొమ్మిదో స్థానాన్ని భాగ్య స్థానం అని కూడా అంటారు. అంటే హౌస్ ఆఫ్ లక్ అన్నమాట. జాతక చక్రంలో ఈ తొమ్మిదవ స్థానం బలంగా ఉన్నవారు జీవితంలో తప్పకుండా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వారి జీవితాలకు తిరుగు ఉండదు. ఇది అదృష్ట స్థానం కనుక వారు చేపట్టే ప్రతి పని విజయవంతం అవుతుంది. అందువల్ల జాతక చక్రంలో ఈ తొమ్మిదవ స్థానం మాత్రం బాగా బలంగా ఉండటం అవసరం. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం మూడు రాశుల వారికి వారి తొమ్మిదవ రాశిలో శుభగ్రహాల సంచారం జరుగుతోంది. దీనివల్ల వారి వారి రంగాలలో వారికి తప్పకుండా విజయం చేకూరుతుంది. అదృష్ట యోగం పడుతుంది. సింహ, తుల, కుంభరాశి వారికి తొమ్మిదవ స్థానంలో గ్రహ సంచారం జరుగుతున్నందువల్ల ఈ రాశుల వారిపై ఈ గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో ఇక్కడ పరిశీలిద్దాం..

  1. సింహ రాశి: ఈ రాశి వారికి తొమ్మిదవ స్థానంలో అంటే భాగ్యస్థానంలో ఏకంగా నాలుగు గ్రహాలు  సంచరిస్తూ ఉండటం ఒక గొప్ప విశేషం. పైగా సింహ రాశికి అధిపతి అయిన రవి గ్రహం కూడా తొమ్మిదవ స్థానంలో ఉచ్ఛ స్థితిలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ రాశి వారికి తప్పకుండా అనేక అంశాలలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం, వృత్తి, ఆర్థికం, విదేశీయానం, సంతానం వంటి విషయాలలో వీరికి అద్భుతమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. వీరికి ఈ నెలలో ఉద్యోగ పరంగా మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారం చేపట్టడం, ఉద్యోగం మారటానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం, నిరుద్యోగులకు మంచి ఉద్యోగంలో అవకాశం దొరకటం, ఉద్యోగంలో స్థిరత్వం లభించడం వంటివి తప్పకుండా జరుగుతాయి. విదేశాల్లో ఉద్యోగం సంపాదించడానికి, వీసా సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది.  కొద్ది ప్రయత్నంతో మనసులోని కోరికలన్నీ నెరవేరే సూచనలు ఉన్నాయి.
  2. తులా రాశి: ఈ రాశి వారికి భాగ్య స్థానంలో శుక్ర కుజులు సంచారం చేయడం వల్ల మంచి అదృష్ట యోగం పట్టబోతోంది. ఇందులో శుక్ర గ్రహం తులా రాశికి అధిపతి కూడా అయినందువల్ల తప్పకుండా ఒక నెల రోజుల కాలంలో ఈ రాశి వారి జీవితంలో శుభ పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ఈ రాశి వారు చేసే ప్రతి ప్రయత్నం సఫలం అవు తుంది. ఉద్యోగంలో అధికార యోగం పడు తుంది. నిరుద్యోగులకు ఆశించిన దాని కంటే మెరుగైన ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఈ రాశి వారికి బాగా డిమాండ్ పెరుగుతుంది. యాక్టివిటీ ఎక్కువ అవుతుంది. వివాహం కాని వారికి అకస్మాత్తుగా మంచి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు. దూరప్రాంతం నుంచి శుభ వార్తలు వింటారు. సంతానం లేని వారికి సంతానయోగం పడుతుంది. ఈ రాశి వారికి దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పవచ్చు. దీని గురించైనా పాజిటివ్ గా ఆలోచించడం తరువాయి, అది తప్పకుండా కార్యరూపం ధరిస్తుంది.
  3. కుంభ రాశి: ఈ రాశి వారికి భాగ్యస్థానంలో కేతు సంచారం వల్ల అనేక సానుకూల పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు అకస్మాత్తుగా పరిష్కారం కావడం, కోర్టు కేసులు సానుకూలంగా మారిపోవడం, ఇతరుల నుంచి రావలసిన డబ్బు అనూహ్యంగా చేతికి అందడం, ఆర్థిక లావాదేవీల  వల్ల ఆశించిన ప్రయోజనం కలగడం వంటివి జరుగుతాయి. వడ్డీ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు, ఆధ్యాత్మిక రంగానికి చెందినవారు ఎంతగానో లబ్ధి పొందుతారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు వంటి వృత్తి నిపుణులు ఊహించని విధంగా పురోగతి సాధిస్తారు. ప్రతి చిన్న ప్రయత్నం భారీగా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ నెలరోజుల కాలంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో చక్కటి ఫలితాలను ఇస్తాయి. అనుకోకుండా అనేక పర్యాయాలు తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఉంది. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తి లేదా సంపద కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి