Watch Video: ‘సూర్యకుమార్ మిస్టర్ 360 కాదు.. 420 ప్లేయర్.. నా క్రెడిట్ అంతా కొట్టేస్తాడు’
PBKS VS MI, IPL 2023: ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడారు.
ఐపీఎల్ 2023 46వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుతం చేసింది. పంజాబ్ కింగ్స్‌పై 215 పరుగుల లక్ష్యాన్ని 7 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. ఈ ముంబై విజయానికి ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ హీరోలుగా నిలిచాడు. వీరిద్దరూ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు కొట్టడంతో పాటు వీరిద్దరి మధ్య అద్భుతమైన సెంచరీ భాగస్వామ్యం నెలకొంది. ఈ భాగస్వామ్యం ఆధారంగా ముంబై వరుసగా రెండోసారి 200 పరుగులకు పైగా స్కోరును ఛేదించింది. అయితే, మ్యాచ్ తర్వాత, ఇషాన్ కిషన్ తన బ్యాటింగ్ భాగస్వామి సూర్యకుమార్ యాదవ్‌తో కొంచెం నిరాశకు గురయ్యాడు.
ఇషాన్ కిషన్ నిరాశ చెందడానికి గల కారణాన్ని ఐపీఎల్ వీడియోలో వ్యక్తపరిచాడు. తాను పరుగులు చేసినప్పుడల్లా సూర్య బ్యాట్ కూడా పరుగుల వర్షం కురిపిస్తుంది అంటూ సూర్యకుమార్ యాదవ్ ముందు ఇషాన్ కిషన్ వాపోయాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ నాకు రావాల్సిన క్రెడిట్ అంతా కొట్టేసి, హెడ్ లైన్స్‌లో నిలుస్తాడు అంటూ ఇషాన్ కిషన్ సరదాగా చెప్పుకొచ్చాడు. దీంతో పాటు సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా సామ్ కుర్రాన్ వేసిన ఓవర్‌లో ఇషాన్ పరుగులు చేసిన తీరు ఆకట్టుకుంది.
మొహాలీలో నిప్పుల వర్షం కురిపించిన సూర్యకుమార్ యాదవ్..
పంజాబ్ కింగ్స్‌పై సూర్యకుమార్ యాదవ్ కేవలం 31 బంతుల్లో 66 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి 8 ఫోర్లు, 2 సిక్సర్లు వచ్చాయి. సూర్య స్ట్రైక్ రేట్ 212 కంటే ఎక్కువగా నిలిచింది. సూర్యకుమార్ పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్, ఐపిఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడు సామ్ కర్రాన్‌ను చిత్తుగా కొట్టేశాడు. సామ్ కుర్రాన్ 13వ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఆ ఓవర్‌లో మొత్తం 23 పరుగులు పిండుకున్నాడు. కర్రన్ వేసిన ఓవర్లో సూర్య రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు.
Explosive partnership ? 3️⃣6️⃣0️⃣ show ? Shining bright in presence of lucky charm father ?
Presenting Magical Mohali tales with @ishankishan51 & @surya_14kumar ????
Full Interview ?? #TATAIPL | #PBKSvMI | @mipaltan https://t.co/Y24cYFIoCd pic.twitter.com/syvYwOsS6w
— IndianPremierLeague (@IPL) May 4, 2023
సత్తా చాటిన ఇషాన్ కిషన్..
41 బంతుల్లో 75 పరుగుల ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఇషాన్ కిషన్ హీరోగా నిలిచాడు. కిషన్ బ్యాట్ నుంచి మొత్తం 4 సిక్సర్లు, 7 ఫోర్లు వచ్చాయి. రోహిత్ శర్మ 0 పరుగుల వద్ద పెవిలియన్ చేరిన తర్వాత.. కామెరూన్ గ్రీన్‌తో కలిసి కిషన్ 54 పరుగులు జోడించాడు. దీని తర్వాత, అతను సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి 55 బంతుల్లో 116 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. ఈ రెండు భాగస్వామ్యాల ఆధారంగా ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..