Kohli vs Gambhir Fight: కోహ్లీ, గంభీర్‌లకు విధించిన జరిమానా ఎవరు చెల్లిస్తారు?
Virat Kohli vs Gautam Gambhir, IPL 2023: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ ఘర్షణ పడ్డారు. ఇద్దరి మధ్య భీకర మాటల యుద్ధం జరిగింది.
లక్నో, బెంగళూరు మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ , గౌతమ్ గంభీర్ మధ్య హోరాహోరీ పోరు మొదలైంది. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ కోహ్లీ, లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్‌లకు బీసీసీఐ జరిమానా విధించింది. ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో 100% జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరూ ఎంత డబ్బు కోల్పోయారు, ఈ జరిమానా ఎవరు చెల్లిస్తారు? వంటి కొన్ని ప్రశ్నలు సోషల్ మీడియాలో నెటిజన్లను వేధిస్తున్నాయి. వాటికి ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం..
ఐపీఎల్‌లో కోహ్లీ జీతం రూ.15 కోట్లు. అంటే ఆర్సీబీ నుంచి ఏడాదిలో రూ.15 కోట్లు అందుకుంటాడు. ఇలాంటి పరిస్థితిలో ఒక మ్యాచ్‌కి అతని ఫీజు దాదాపు 1.07 కోట్ల రూపాయలన్నమాట. అంటే లక్నోతో జరిగిన మ్యాచ్ తర్వాత రూ.1.7 కోట్ల నష్టాన్ని చవిచూశాడు.
కోహ్లి జేబుకు చిల్లు పడదు..
ఒకవేళ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి, దాని ప్రయాణం ముందుకు సాగితే, మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా మ్యాచ్ ఫీజు నిర్ణయించనున్నారు. ఓవరాల్ గా కోహ్లికి కోటి రూపాయల నష్టం వాటిల్లనుంది. కానీ, కోహ్లీ జేబుకు మాత్రం ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఈ జరిమానా అతను కట్టడు. అతని ఫ్రాంచైజీ అంటే ఆర్సీబీ కడుతుంది. Cricbuzz ప్రకారం, ఫ్రాంచైజీ కోహ్లీ జీతంలో కోత విధించదు. ఈ నష్ట భారాన్ని ఫ్రాంచైజీ స్వయంగా భరించాల్సి ఉంటుంది.
గంభీర్‌పై రూ.25 లక్షల జరిమానా..
మరోవైపు, ఒక మ్యాచ్‌కు గంభీర్ ఫీజు దాదాపు రూ.25 లక్షలు. అతని జరిమానాను కూడా ఫ్రాంచైజీ చెల్లించాల్సి ఉంటుంది. చాలా మంది ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లకు జరిమానా చెల్లిస్తారు. స్లో ఓవర్ రేట్ కోసం విధించిన జరిమానా కూడా ఫ్రాంచైజీనే చెల్లిస్తుంది. ఆటగాడి జీతంలో ఎటువంటి కోత విధించదు.
బీసీసీఐ బిల్లులు ఎవరికి పంపుతుందంటే..
ప్రతి సీజన్ ముగిసిన తర్వాత, BCCI జట్లపై విధించిన అన్ని జరిమానాలకు సంబంధించిన బిల్లును ఫ్రాంచైజీలకు పంపిస్తుంది. ఆ మేరకు ఫ్రాంచైజీలే ఆయా జరిమానాలను క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఆటగాళ్ల జీతం నుంచి ఫ్రాంచైజీ మినహాయించాలా లేదా అనేది జట్టు అంతర్గత విషయం. చాలా సందర్భాలలో, ఫ్రాంచైజీ ఆటగాళ్లపై జరిమానా విధించదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..