ICC ODI Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన హైదరాబాదీ పేసర్.. రోహిత్, కోహ్లీలకు షాక్..
Team India ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ రెండో స్థానంలో ఉన్నాడు. టాప్ 10 ఆటగాళ్ల జాబితాలో సిరాజ్ ఒక్కడే భారత్ నుంచి చోటు దక్కించుకున్నాడు.
ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ రెండో స్థానంలో ఉన్నాడు. టాప్ 10లో ఉన్న ఏకైక భారత బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ అగ్రస్థానంలో నిలిచాడు. బ్యాట్స్‌మెన్‌ల వన్డే ర్యాంకింగ్స్‌ను పరిశీలిస్తే, బాబర్ అజామ్ అగ్రస్థానంలో ఉన్నాడు. టాప్ 5 ఆటగాళ్ల జాబితాలో ముగ్గురు పాకిస్థానీలు ఉన్నారు. టాప్ 5లో ఉన్న ఏకైక భారత బ్యాట్స్‌మెన్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఆల్ రౌండర్ల టాప్ 10 జాబితాలో ఒక్క భారత ఆటగాడు కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ విషయంలో బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్-అల్-హసన్ అగ్రస్థానంలో నిలిచాడు.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో జోష్ హేజిల్‌వుడ్ బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. భారత బౌలర్ సిరాజ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ మూడో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన ట్రెంట్ బౌల్ట్ నాలుగో స్థానంలో ఉన్నాడు. మాట్ హెన్రీ ఐదవ స్థానంలో ఉన్నాడు.
బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. టాప్ 5 బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో ఉన్న ఏకైక భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ విషయంలో బాబర్ ఆజం అగ్రస్థానంలో ఉన్నాడు. ఫఖర్ జమాన్ రెండో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన వాన్ డెర్ డుసెన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. భారత వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 7వ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 9వ స్థానంలో ఉన్నాడు.
Three Pakistan players in the top five ODI batters ?
The latest changes in the @MRFWorldwide ICC Men’s Player Rankings ⬇️https://t.co/1L07ZSzOZo
— ICC (@ICC) May 4, 2023
వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్-అల్-హసన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన మహ్మద్ నబీ రెండో స్థానంలో ఉన్నాడు. రషీద్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నాడు. జింబాబ్వేకు చెందిన సికందర్ రజా నాలుగో స్థానంలో ఉన్నాడు. కాగా జీషాన్ మక్సూద్ ఐదో స్థానంలో ఉన్నాడు. జీషాన్ ఒమన్‌కు చెందిన ఆటగాడు. ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 20 జాబితాలో ఒక్క భారత ఆటగాడు మాత్రమే ఉన్నాడు. హార్దిక్ పాండ్యా 13వ స్థానంలో ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..