CM Jagan: ఇవాళ విశాఖలో సీఎం జగన్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. టూర్ పూర్తి షెడ్యూల్ ఇదే
మధ్యాహ్నం 3 గంటల నుంచి 8 గంటల వరకు ఐదు గంటల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు సీఎం జగన్. మొదట బీచ్‌రోడ్డులో పది కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన యుద్ధ విమాన ప్రదర్శనశాల సీ హేర్రియర్‌ను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు (మే11) విశాఖలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధికార్యక్రమాల ప్రారంభోత్సవంలో భాగంగా జగన్ విశాఖ రానున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి 8 గంటల వరకు ఐదు గంటల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు సీఎం జగన్. మొదట బీచ్‌రోడ్డులో పది కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన యుద్ధ విమాన ప్రదర్శనశాల సీ హేర్రియర్‌ను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఈ సీ హారియర్ మ్యూజియం దేశంలోనే మొట్టమొదటిది కావడం విశేషం. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సీ హేర్రియర్ ను సందర్శించిన ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మ్యూజియం దేశానికే తలమానికంగా నిలుస్తుందన్నారు. సాయంత్రం 3.50 గంటలకు పీఎం పాలెం వైఎస్సార్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. దీని తర్వాత 4.50 గంటలకు ఆరిలోవ అపోలో ఆస్పత్రికి చేరుకుని, అపోలో కేన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 5.50 గంటలకు బీచ్ రోడ్డుకు చేరుకుంటారు, అక్కడ వీఎంఆర్డీఏ అభివృద్ది చేసిన సీ హారియర్ యుద్ద విమాన మ్యూజియంను ప్రారంభిస్తారు. అక్కడి నుంచే రామ్‌నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
అనంతరం ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు జగన్. అక్కడి నుంచి 6.15 గంటలకు బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న ఎమ్మెల్యే గొల్ల బాబురావు కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు తిరుగు ప్రయాణమై 8.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి