UP Police Viral Video: లక్నోలో పోకిరి సినిమా సీన్ రిపీట్..! బాలికను వెంబడిస్తూ.. కీచక పోలీసు..
మహిళలకు రక్షణగా ఉండాల్సిన కొందరు పోలీసులే దారుణాలకు పాల్పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు. తాజాగా లక్నోలో పోకిరి సినిమాసీన్ రిపీట్ అయింది. సదర్ ప్రాంతంలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్ధిని వెంబడించి వేధింపులకు గురి చేసాడు ఓ హెడ్ కానిస్టేబుల్
ఓ వైపు దేశంలో ఆడ పిల్లలపై జరుగుతున్న ఆఘాయిత్యాలు, లైంగిక వేధింపులకు అడ్డుకట్టవేయడానికి అనేక రకాల చట్టాలు శిక్షలు అమల్లోకి తెచ్చారు. మరోవైపు వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఆడదైతే చాలు అన్నచందంగా వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు కొందరు మృగాళ్లు. అయితే మహిళలకు రక్షణగా ఉండాల్సిన కొందరు పోలీసులే దారుణాలకు పాల్పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు. తాజాగా లక్నోలో పోకిరి సినిమాసీన్ రిపీట్ అయింది. సదర్ ప్రాంతంలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్ధిని వెంబడించి వేధింపులకు గురి చేసాడు ఓ హెడ్ కానిస్టేబుల్ అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆ పోలీసును నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
ఈ వీడియోలో ఓ విద్యార్ధిని సైకిలుపై స్కూలుకు వెళ్తోంది. పోలీస్ అని రాసిఉన్న స్కూటీపై హెల్మెట్ ధరించి ఉన్న కానిస్టేబుల్ షాదత్ అలీ ఆ విద్యార్ధిని వెంబడిస్తూ ఆమెను వేధిస్తున్నాడు. ఇదంతా వారి వెనుకే ద్విచక్రవాహనంపై వస్తున్న మరో మహిళ, ఓ యువకుడు వీడియో తీశారు. కొంత దూరం వెళ్లాక మహిళ ఆ కానిస్టేబుల్‌ను ఆపి, ఆ అమ్మాయిని ఎందుకు వేధిస్తున్నావని నిలదీసింది. అతని ఫోన్ నెంబర్, బైక్ నెంబర్ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇది ఎలక్ట్రిక్ బైక్ అని, నెంబరు లేదని చెప్పాడు.
UP police constable ‘Shahadat Khan’ was arrested and FIR was lodged under molestation and #pocsoact
For past some days, the constable was continuously following and harrasing school girls.
The constable is posted in UP-112 helpline in #Lucknow. He has been Suspended. pic.twitter.com/GdmpO4Jz00
— Ganesh (@Ganesh00242004) May 3, 2023
మహిళ ప్రతిరోజూ ఇలా అమ్మాయిలను ఎందుకు వెంబడిస్తున్నావని అతన్ని నిలదీసింది. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అదికాస్తా ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు లక్నో తూర్పు డీసీపీ హిర్దేశ్ కుమార్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..