Delhi BRS Office: హస్తినలో తెలంగాణ అస్థిత్వ ప్రతీక.. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
దేశ రాజధానిలో తెలంగాణ ఆత్మగౌరవ పతాక సగర్వంగా ఎగిరింది. హస్తినలో తెలంగాణ అస్థిత్వ ప్రతీక సగౌరవంగా మెరిసింది. BRS తన రాజకీయ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.
దేశ రాజధానిలో తెలంగాణ ఆత్మగౌరవ పతాక సగర్వంగా ఎగిరింది. హస్తినలో తెలంగాణ అస్థిత్వ ప్రతీక సగౌరవంగా మెరిసింది. BRS తన రాజకీయ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. జాతీయ రాజకీయ విస్తరణకు శాశ్వత వేదికగా ఢిల్లీ వసంత్‌విహార్‌లో నిర్మించిన భారత్ రాష్ట్ర సమితి భవన్‌ను బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాసేపట్లో పార్టీ కాన్ఫరెన్స్ హాలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ తొలి సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర కార్యాలయం ప్రారంభం తరువాత సీఎం కేసీఆర్.. తన ఛాంబర్ లో ఆసీనులయ్యారు. ముందుగా శాస్త్రోక్తంగా సుదర్శన హోమం, వాస్తుపూజ నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని భవిష్యత్ పార్టీ అవసరాలకు అనుగుణంగా నిర్మించారు. మొత్తం నాలుగు అంతస్తుల్లో నిర్మితమైన భవనాన్ని నిర్మించారు. బీఆర్‌ఎస్ రాజకీయాలకు అడ్డాగా మారబోయే ఈ భవనంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 2021 సెప్టెంబర్‌లో భవనానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అత్యంత వేగంగా నిర్మాణం పూర్తైంది. నాలుగు అంతస్తులతో ఉంటుందీ బిల్డింగ్. లోయర్ గ్రౌండ్‌లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల ఛాంబర్లు ఏర్పాటు చేశారు.
ఇక మొదటి అంతస్తులో బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుని ఛాంబర్, ఇతర ఛాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి. 2, 3వ అంతస్తుల్లో మొత్తం 20 రూములు నిర్మించారు. వీటిలో ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్ పోగా.. మిగతా 18 ఇతర రూములు పార్టీ నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాయి.
బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవం.. వీడియో..
మరిన్ని జాతీయ వార్తల కోసం..