Sr.NTR Birthday: పెద్ద సారు కోసం కదిలిన స్టార్ హీరోలు.. అందరూ హీరోలు ఒకే స్టేజి మీద.. దద్దరిల్లిపోవాల్సిందే..
ఓ పక్క జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే హంగామా.. ఆకాశాన్ని అంటుతున్న వేళ.. మరో పక్క ఈ స్టార్ హీరో తాత.. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడి శతజయంతి ఉత్సావాలు కూడా ఘనంగా జరుగుతున్నాయి. రజినీకాంత్ ముఖ్యాథిగా విజయవాడలో మొదలైన ఉత్సవాలు.. తాజాగా హైదరాబాద్ కూకట్ పల్లి వేదికగా జరిగే వరకు వచ్చాయి.
ఓ పక్క జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే హంగామా.. ఆకాశాన్ని అంటుతున్న వేళ.. మరో పక్క ఈ స్టార్ హీరో తాత.. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడి శతజయంతి ఉత్సావాలు కూడా ఘనంగా జరుగుతున్నాయి. రజినీకాంత్ ముఖ్యాథిగా విజయవాడలో మొదలైన ఉత్సవాలు.. తాజాగా హైదరాబాద్ కూకట్ పల్లి వేదికగా జరిగే వరకు వచ్చాయి. అంతేకాదు.. టాలీవుడ్ హీరోలను కూడా కదిలివచ్చేలా చేస్తున్నాయి. ఈ ఉత్సవాన్ని కన్నల పండగగా మార్చనున్నాయి. ఎస్ ! విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలను రేపు అంటే మే20న హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న కైతలపూర్ మైదానంలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇక ఈ వేడుకక కోసం పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వెంకటేష్, ప్రభాస్, కళ్యాణ్ రామ్ తదితరులకు వెల్కమ్ చెబుతూ ప్రత్యేక బ్యానర్లు రోడ్లపై కనిపించడం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆకట్టుకోవడం మాత్రమే కాదు.. టాలీవుడ్ టాప్ హీరోలు ఒకే వేదికపై కనిపిస్తున్నారన్నదే ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీళ్లందరితో బాలకృష్ణకు అన్ స్టాపబుల్ షో రూపంలో మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ చనువుతోనే ఆయనే స్వయంగా వాళ్ళను ఆహ్వానించినట్టు దానికి అంగీకారం వచ్చినట్టు తెలిసింది. చివరి నిమిషంలో ఒకరిద్దరు డ్రాప్ అయినా మొత్తానికి కనులవిందుగా అనిపించే తారాతోరణం సందడి చేయబోతోంది. చిరంజీవికీ ఆహ్వానం ఉన్నప్పటికీ ప్రస్తుతం విదేశాల్లో ఉన్న కారణంగా హాజరు కాలేకపోతున్నట్టు సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

