Astro Tips for Marriage: ఈ గుణాలుంటే త్వరగా పెళ్లవుతుంది.. కాబోయే భర్తలో స్త్రీలు కోరుకునే ఐదు లక్షణాలు ఏమిటో తెలుసా..

ఎలాంటి పురుషులను పెళ్లి చేసుకోవాలనే విషయంపై ఒక అవగాహనతో ఉంటారు. అయితే సమస్య ఏమిటంటే.. చాలా మంది పురుషులకు .. ఆడవారి మనసులో ఏముందో తెలియదు.పెళ్లి కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కకుండా నిరాశతో ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే స్త్రీలకు పురుషుల్లో ఎలాంటి గుణాలు కోరుకుంటారో తెలియదు.

Astro Tips for Marriage: ఈ గుణాలుంటే త్వరగా పెళ్లవుతుంది.. కాబోయే భర్తలో స్త్రీలు కోరుకునే ఐదు లక్షణాలు ఏమిటో తెలుసా..
Marriage
Follow us
Surya Kala

|

Updated on: May 22, 2023 | 9:30 AM

పెళ్లి యువతీయువకుల జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. పెళ్లి గురించి ఆడపిల్లలు ఎన్నో కలలు కంటారు. చిన్న చిన్న కలలతో మేఘాల్లో తేలిపోతూ ఉంటారు. పెరిగే కొద్దీ.. కలల కాన్వాస్‌పై కొత్త రంగు అడ్డుకుంటూ జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే పెళ్లి ప్రాముఖ్యత.. తాను పెళ్లి చేసుకోవాలనుకునే జీవిత భాగస్వామి గురించి పురుషుల కంటే మహిళలలే చాలా రెట్లు ఎక్కువగా ఆలోచిస్తారు. తమ జీవితంలో ఎటువంటి వ్యక్తులు అడుగు పెట్టాలి.. తాము ఎలాంటి పురుషులను పెళ్లి చేసుకోవాలనే విషయంపై ఒక అవగాహనతో ఉంటారు. అయితే సమస్య ఏమిటంటే.. చాలా మంది పురుషులకు .. ఆడవారి మనసులో ఏముందో తెలియదు.పెళ్లి కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కకుండా నిరాశతో ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే స్త్రీలకు పురుషుల్లో ఎలాంటి గుణాలు కోరుకుంటారో తెలియదు.

అయితే స్త్రీలకు పురుషుల్లో ఏ లక్షణాలు కావాలో తెలిస్తే.. ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. మహిళలు తమ కాబోయే భర్తలలో ఎలాంటి లక్షణాలను కోరుకుంటారో ఈ రోజు తెలుసుకుందాం.. ఈ లక్షణాలు స్వావలంబన అయితే.. పెళ్లి విషయంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు.

ప్రతి విషయంలోనూ నైపుణ్యం కలిగి ఉండాలి.. 

ఇవి కూడా చదవండి

స్త్రీలు ఎప్పుడూ పరిపూర్ణ పురుషుడిని కోరుకుంటారు. కనుక ప్రతి విషయంపై అవగాహన కలిగి ఉండే గుణాన్ని అలవర్చుకోవాలి. ఇంటి నుంచి ఆఫీస్ వరకూ ప్రతి చోటా నాణ్యత మెరుగుపరచుకునే విధంగా చూసుకోవాలి. నైపుణ్యంతో పనులను చక్కబెట్టుకుని పురుషుడి ప్రేమ ఎప్పటికీ కోల్పోకూడదని స్త్రీలు కోరుకుంటారు.  మరియు ఒక విషయం గుర్తుంచుకోండి, ఇప్పటి నుండి, మీరు సంబంధాన్ని చూడాలనుకుంటే, మీ ప్రశంసల బాధ్యతను మీ చేతుల్లోకి తీసుకోండి. మీరు ఆఫీసులో మరియు ఇంట్లో రాజ్యమేలుతున్నారని మీ ముందు ఉన్న స్త్రీ అర్థం చేసుకోవాలి. అప్పుడు పెళ్లి అనేది కేవలం సమయం మాత్రమే.

మధురంగా మాట్లాడే నేర్పు ఉన్న పురుషుడిని..  నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని పెద్దల మాట. ఇదే విధంగా తాము పెళ్లి చేసుకునే వ్యక్తి మాట తీరు మధురంగా ఉండాలని కోరుకుంటారు. తన భర్త మాట్లాడుతుంటే.. ప్రతి ఒక్కరూ అతని మాటను వినాలని భావిస్తారు. బాగా మాట్లాడగలిగే పురుషుల జీవితంలో ప్రేమకు లోటు ఉండదు. ఏ పనుల్లో నైపుణ్యం లేనప్పటికీ, మహిళలు మాటకారి పురుషుడి వెనుక పరుగెత్తుతూనే ఉంటారు. కనుక పురుషుడు తన నోటి మాటతో ప్రపంచాన్ని గెలిచే విధంగా పట్టు సాధించండి.

విశ్వాసం కలిగి ఉండే నేచర్ ..

పురుషుల్లో స్త్రీలు కోరుకునే మరొక లక్షణం విశ్వాసం. చూపు, మాట, నడక ఇలా ప్రతి విషయంలోనూ పురుషుడిలో విశ్వాసం వ్యక్తం కావాలి. ఇలాంటి వ్యక్తి స్త్రీ హృదయాన్ని ఆకట్టుకుంటాడు. పెళ్లి చూపులకు వెళ్లిన సమయంలో అమ్మాయితో మాట్లాడడానికి ఎక్కువ సమయం దొరకదు. కనుక తక్కువ సమయంలో యువతి మనసుకు గేలం వేయాలంటే.. మీ విశ్వాసమే మీకు ఆయుధంగా నిలుస్తుంది.

శరీర దారుఢ్యం ..

వయసుతో సంబంధం లేకుండా స్త్రీలను ఆకట్టుకోవాలంటే పురుషులకు శారీరక దారుఢ్యం ఒక లక్షణం. నేటి కంప్యూటర్ కాలంలో మారిన అలవాట్లతో శరీరం తీరు కూడా మారుతోంది. కనుక శారీరక దృఢత్వం, ఫిట్ నెట్ పై తప్పనిసరిగా దృష్టి సారించాలి. జిమ్‌లో చెమటోడ్చి కండలు తిరిగిన లుక్‌ని క్రియేట్ చేయాల్సిందే. నేటి యువతి సన్నని రూపాన్ని ఇష్టపడతారు. ఈ సందర్భంలో, కొన్ని ఆహార నియమాలను పాటించడం వలన శరీరం ఫిట్ నెట్ అదుపులో ఉంటుంది. కనుక పురుషులు పెళ్లి చూపులకు వెళ్లాలనుకుంటే.. తప్పనిసరిగా శారీరక లుక్ మీద దృష్టి పెట్టాల్సిందే.

చిరు నవ్వుతో ఉండే ముఖం.. 

చాలా మంది యువకులు సీరియస్‌గా ఉండటానికి ఇష్టపడతారు. అయితే యువతిని యువకుడు ఆకర్షించే లక్షణాల్లో ముఖ్యమైన గుణం చిరునవ్వుతో ఉండే ముఖం. సరదాగా, ఉల్లాసంగా ఉండే పురుషులు.. మహిళల హృదయాన్ని సులభంగా గెలుచుకుంటారు. నిస్తారమైన జీవితంలో వెలుగులు నింపే విధంగా సంతోషాన్ని తీసుకొచ్చేది చిరునవ్వుతో ఉండే ముఖం. ముఖ్యంగా.. పెళ్లి సంబంధం చూసేవారు చిరు నవ్వుతో ఉండే చూసుకోండి. చిరునవ్వుతో ఉన్న పురుషులు.. స్త్రీతో పాటు ఆమె కుటుంబంలోని ఇతర సభ్యుల మనసుని కూడా దోచుకుంటారు.  ఈ ఐదు లక్షణాలున్న యువకులను యువతి పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుందని పెద్దల విశ్వాసం.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..