మీ వాట్సాప్ చాటింగ్ ఎవరికీ కనిపించకూడదంటే ఇలా చేయండి
యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ వస్తోంది మెసేజింగ్ యాప్ వాట్సాప్. మార్కెట్లోకి ఎన్ని మెసేజింగ్ యాప్స్ వచ్చినా వాట్సాప్‌కు క్రేజ్ తగ్గకపోవడానికి ప్రధాన కారణం ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్ తాజాగా..
యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ వస్తోంది మెసేజింగ్ యాప్ వాట్సాప్. మార్కెట్లోకి ఎన్ని మెసేజింగ్ యాప్స్ వచ్చినా వాట్సాప్‌కు క్రేజ్ తగ్గకపోవడానికి ప్రధాన కారణం ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్ తాజాగా మరో సూపర్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తూ తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఏంటి.? అసలు దీని ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ‘లాక్‌చాట్’ పేరుతో వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. సోమవారం రాత్రి నుంచి యూజర్లకు ఈ అప్‌డేట్‌ను అందించింది. ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఫీచర్‌తో యూజర్లు తాము కోరుకుంటున్న చాట్‌ను ఇతరులకు కనిపించకుండా చేసుకోవచ్చు. మీరు వ్యక్తితో చేసే చాట్ కన్వర్జేషన్ ఎవరికీ కనిపించకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. మీరు ఎంచుకున్న కాంటాక్ట్‌ను పాస్‌వర్డ్ లేదా ఫింగర్ ప్రింట్‌తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు ప్రొటెక్ట్ చేసుకున్న కాంటాక్ట్ చాట్ బాక్స్‌లో కూడా కనిపించదు. అలాగే సదరు కాంటాక్ట్ నుంచి మెసేజ్ వచ్చినా పైన కనిపించే నోటిఫికేషన్‌లో ఆ మెసేజ్ కనిపించదు. ఇలా గోప్యతకు పెద్ద పీట వేస్తూ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించి మెటా ఓ వీడియోను సైతం విడదల చేసింది. ఇందులో ఈ కొత్త ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలి.? దానివల్ల కలిగే లాభాలు ఏంటి.? అనే విషయాలను స్పష్టంగా వివరించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్నేహమంటే ఇదేరా.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
పాత పైపుల్లోంచి వింత శబ్ధం !! ఏంటా అని చూస్తే ఒక్కసారిగా
నీటిలో చకచకా ఈదుతున్న తల లేని చేప.. ఇలా ఎలా అని షాక్ అవుతున్న నెటిజన్స్
వార్నీ.. ఇదేం బౌలింగ్‌రా సామీ.. చూస్తే నవ్వాపుకోలేరు
నిర్మాణంలో ఉన్న భవనం ముందు అర్థరాత్రి కుక్కల అరుపులు.. వెళ్లి చూడగా !!
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

