నిర్మాణంలో ఉన్న భవనం ముందు అర్థరాత్రి కుక్కల అరుపులు.. వెళ్లి చూడగా !!
టౌన్ ఏరియాలో అర్థరాత్రి వేళ నిర్మాణంలో ఉన్న ఓ భవనం ముందుకు వచ్చి పదుల సంఖ్యలో కుక్కలు మొరుగుతున్నాయి. ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. ఆ ఇంటి యజమాని అనుమానస్పదంగా లోపలికి వెళ్లి చూడగా.. అనుకోని అతిథి కనిపించింది. దాన్ని చూడగానే ఒక్క ఉదుటన బయటపడ్డాడు.
టౌన్ ఏరియాలో అర్థరాత్రి వేళ నిర్మాణంలో ఉన్న ఓ భవనం ముందుకు వచ్చి పదుల సంఖ్యలో కుక్కలు మొరుగుతున్నాయి. ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. ఆ ఇంటి యజమాని అనుమానస్పదంగా లోపలికి వెళ్లి చూడగా.. అనుకోని అతిథి కనిపించింది. దాన్ని చూడగానే ఒక్క ఉదుటన బయటపడ్డాడు. ఇంతకీ లోపలున్నదేంటో తెలుసా.. ఎలుగుబంటి.. అవును సూర్యాపేటలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. డీమార్ట్ వెనుక నిర్మాణంలో ఉన్న భవనంలోకి రాత్రి ప్రవేశించింది. టౌన్‌లోకి ఎలుగుబంటి ఎక్కడ నుంచి వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. స్థానికుల సమాచారంతో పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది.. స్పాట్‌కు చేరుకుని ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. సరైన సామాగ్రి లేకపోవడంతో హైదరాబాద్ నుంచే అవసరమైన సామాగ్రి తెప్పించే ఏర్పాట్లు చేసారు. వేసవి ఎండలు తీవ్రతకు అడవుల్లో నీళ్లు దొరకక వన్యప్రాణులు ఇలా జనావాసాల్లోకి వస్తుంటాయి. ఇలాంటి జంతువులు ఏవైనా కనిపిస్తే.. వెంటనే తమకు సమాచారమివ్వాలని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాన్సర్ బారిన పడిన తల్లికోసం ఆ బాలుడు చేసిన పనికి.. కంటతడి ప్రేమ
కట్నం అడిగిన అల్లుడిని పెళ్లి పీటలపైనే చెప్పుతో కొట్టిన మామ !!
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

