కట్నం అడిగిన అల్లుడిని పెళ్లి పీటలపైనే చెప్పుతో కొట్టిన మామ !!
కట్నం తీసుకోవడం, ఇవ్వడం చట్ట విరుద్ధం అని అందరికీ తెలుసు. ఈ విషయమై అవగాహన కల్పించినా.. మార్పు రావడం లేదు. లాంచనాలనో, ఇంకోటనో ఏదో రూపంలో వాళ్లు వసూలు చేస్తూనే ఉన్నారు.. వీళ్లు ఇస్తూనే ఉన్నారు. దాంతో ఆడపిల్ల తల్లిదండ్రులకు కూతురి వివాహం చేయడం పెను భారంగా
కట్నం తీసుకోవడం, ఇవ్వడం చట్ట విరుద్ధం అని అందరికీ తెలుసు. ఈ విషయమై అవగాహన కల్పించినా.. మార్పు రావడం లేదు. లాంచనాలనో, ఇంకోటనో ఏదో రూపంలో వాళ్లు వసూలు చేస్తూనే ఉన్నారు.. వీళ్లు ఇస్తూనే ఉన్నారు. దాంతో ఆడపిల్ల తల్లిదండ్రులకు కూతురి వివాహం చేయడం పెను భారంగా మారిపోయింది. ఇటీవల చాలామంది తమ కూతురు అత్తింట్లో ఆనందంగా ఉంటే చాలనుకుని అప్పు చేసైనా అల్లుడు అడిగినంత కట్నంగా ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని తీర్చే దారిలేక అప్పుల బాధతో ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలూ చూశాం. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిన తీరు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. పెళ్లిలో కట్నం అడిగిన అల్లుడిని చెప్పుతో కొట్టాడు పిల్లనిచ్చిన మామ. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో వరుడు తనకు బైక్ కట్నంగా ఇవ్వాలని మామను అడగటంతో ఆయనకు కోపం వచ్చి, పెళ్లి వేడుకలోనే అందరి ముందు పెళ్లి కొడుకును చెప్పుతో కొట్టాడు. అయితే, ఇది స్క్రిప్టెడ్ వీడియో అని తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కట్నం అడిగితే ఇలా బుద్ధి చెప్పాలంటూ ఓ వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

