Laughing : గట్టిగా నవ్వుతున్నారా? పై ప్రాణాలు పైకే పోతాయ్.. తాజా పరిశోధనలో సంచలన విషయాలు..
చిరు నవ్వులతో బ్రతకాలి.. చిరంజీవిగా బ్రతకాలి.. అంటూ ‘మీ శ్రేయోభిలాషి’ సినిమాలో పాట గుర్తుండే ఉంటుంది. ఈ లిరిక్స్ అర్థం ఏంటో మనందరికీ తెలిసిందే. అయితే, ఇది అక్షరాలా సత్యం అని నిరూపిస్తోంది సైన్స్. చిరు నవ్వే చిరంజీవిగా బ్రతికిస్తుంది.. పెద్ద పెద్ద నవ్వితే ప్రాణాలు హరిస్తుందని చెబుతోంది సైన్స్.
చిరు నవ్వులతో బ్రతకాలి.. చిరంజీవిగా బ్రతకాలి.. అంటూ ‘మీ శ్రేయోభిలాషి’ సినిమాలో పాట గుర్తుండే ఉంటుంది. ఈ లిరిక్స్ అర్థం ఏంటో మనందరికీ తెలిసిందే. అయితే, ఇది అక్షరాలా సత్యం అని నిరూపిస్తోంది సైన్స్. చిరు నవ్వే చిరంజీవిగా బ్రతికిస్తుంది.. పెద్ద పెద్ద నవ్వితే ప్రాణాలు హరిస్తుందని చెబుతోంది సైన్స్. అవును. తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించాయి కొన్ని నివేదికలు. ఇందుకు ఉదాహరణగా ఎన్నో ఘటనలను చూపిస్తున్నారు నిపుణులు. అతిగా నవ్వడం వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందంటూ చావు కబురు చల్లగా చెప్పారు!
ఉదాహరణలు..
1975లో, అలెక్స్ మిచెల్ అనే బ్రిటిష్ వ్యక్తి ‘ది గూడీస్’ అనే ప్రసిద్ధ కామెడీ షో చూస్తూ.. 30 నిమిషాల పాటు పొట్ట పట్టుకుని నవ్వుతూనే ఉన్నాడు. ఆపై నేలపై కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. 2003లో, థాయ్‌లాండ్‌లోని ఒక ఐస్‌క్రీమ్ ట్రక్ డ్రైవర్ నిద్రలో బిగ్గరగా నవ్వడం ప్రారంభించాడు. పక్కనే నిద్రిస్తున్న భార్య అతడిని లేపేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె ప్రయత్నం విఫలమైంది. అంతలోనే ఆ వ్యక్తి ఊపిరి ఆగిపోయింది. ఇలాంటి ఘటన భారత్‌లోనూ చోటు చేసుకుంది. 2013లో, మహారాష్ట్రకు చెందిన 22 ఏళ్ల యువకుడు మంగేష్ భోగల్ తన స్నేహితుడితో కలిసి ‘గ్రాండ్ మస్తీ’ అనే కామెడీ పిక్చర్ చూడటానికి వెళ్లాడు. సినిమా స్క్రీనింగ్ సమయంలో భోగల్ గట్టిగా, నిరంతరాయంగా నవ్వాడు. దాంతో హార్ట్ ఎటాక్ వచ్చిం.. ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రికి తరలించే లోపే జరగరాని నష్టం జరిగిపోయింది.
‘నవ్వు’ చంపేస్తుంది..
సాధారణ నవ్వు కారణంగా ఎవరూ మరణించిన దాఖలాలు లేవని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, వరుసగా, గట్టిగా నవ్వడం వల్ల ఊపిరాడక, గుండెపోటుకు గురైన చనిపోయిన వారు చాలా మంది ఉన్నారని చెబుతున్నారు. వాస్తవానికకి నవ్వు అనేది ఆరోగ్యకరమైన అలవాటు. ముక్తసరిగా నవ్వడంలో ఇబ్బంది లేదు. డాక్టర్లు కూడా నవ్వాలనే సలహా ఇస్తుంటారు. నవ్వు ఉత్తమ ఔషధంగా పేర్కొంటారు. నవ్వు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే, ప్రతి ఒక్కరి శరీరం వివిధ రకాలుగా స్పందిస్తుంది. చాలా బిగ్గరగా నవ్వడం కొంతమందికి ఇబ్బందిని కలిగిస్తుంది. అందుకే.. మీ శరీరం, ఆరోగ్యాన్ని బట్టి నవ్వాలని సూచిస్తున్నారు నిపుణులు. నవ్వడానికి ముందు లేదా తర్వాత ఏవైనా అసాధారణ లక్షణాలను కనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..