AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెవి విషయంలో ఈ నిర్లక్ష్యం చేస్తే సౌండ్ శాశ్వతంగా కట్ అయిపోవడం ఖాయం..

చాలా మంది చెవి సమస్యలను తేలికగా తీసుకోవడం చూస్తుంటాం. చాలా సార్లు సమస్య పెరిగి తట్టుకోలేక డాక్టర్ దగ్గరకు పరిగెత్తుతుంటాం.

చెవి విషయంలో ఈ నిర్లక్ష్యం చేస్తే సౌండ్ శాశ్వతంగా కట్ అయిపోవడం ఖాయం..
Ent
Madhavi
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 01, 2023 | 9:45 AM

Share

చాలా మంది చెవి సమస్యలను తేలికగా తీసుకోవడం చూస్తుంటాం. చాలా సార్లు సమస్య పెరిగి తట్టుకోలేక డాక్టర్ దగ్గరకు పరిగెత్తుతుంటాం. చెవికి సంబంధించిన ప్రతి చిన్న, పెద్ద సమస్య గురించి నిపుణులతో సలహా పాటించాల్సిందే. చెవి ఆరోగ్యం కోసం ఈ 7 విషయాలు తప్పక పాటించాలి.

-చెవిలో నిరంతరం దురద, చెవి నొప్పి మొదలైన చిన్న సమస్యలపై కూడా శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతి 6 నెలలకోసారి చెవి పరీక్ష చేయించుకోవాలి.

– చెవి దురదగా ఉంటే, వేలిని చొప్పించడం మంచిది కాదు. ఇలా చేస్తే దురద మరింత పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

– చెవి లోపల ఇయర్ బడ్స్ లేదా కాటన్ ఏదైనా పెట్టుకోవడం సరికాదు. దీని వల్ల ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉంది. మీరు శుభ్రం చేయవలసి వస్తే, అప్పుడు కనిపించే చెవి బయటి భాగాన్ని మాత్రమే శుభ్రం చేయండి.

-చెవి లోపల మైనం తయారీ అనేది సహజ ప్రక్రియ. చెవి ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం. మైనం యాంటీఅలెర్జిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గా పనిచేస్తూ చిన్న చిన్న కీటకాలను సైతం చెవిలో దూరకుండా చేస్తుంది.

– చెవిలోంచి మైనం బయటకు వచ్చే ప్రక్రియ కూడా సహజమే. కొందరిలో వాక్స్ దానంతట అదే బయటకు రానప్పుడు చెవిలోపల గట్టిపడుతుంది. ఈ సందర్భంలో, డాక్టర్ సహాయం తీసుకోవాలి.

-చెవిలో కొబ్బరి నూనె పోయకూడదు.

– ప్రతిరోజూ 1 గంటకు పైగా మొబైల్ ఫోన్‌లో చెవికి దగ్గరగా మాట్లాడటం, మొత్తం వాల్యూమ్‌లో 60% కంటే ఎక్కువ వాల్యూమ్‌లో సంగీతం వినడం కూడా వినికిడి లోపం కలిగిస్తుంది. మీరు స్పీకర్ మోడ్‌లో మొబైల్‌ని మాట్లాడటం మేలు.

ఈ వస్తువులను చెవిలో పెట్టకండి:

కొందరు వేలితో, అగ్గిపుల్లతో, బైక్ కీతో కూడా చెవులోపలి మైనం తీస్తుంటారు. ఇలా చేయడం ద్వారా, కాస్త ఉపశమనం పొందుతారు. కానీ చెవిలో అగ్గిపుల్లలు, పిన్నులు లేదా కీ చెయిన్ లు పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. చెవిలో నొప్పి, లేదా చీము రావడం, నొప్పి కూడా ప్రారంభమైనప్పుడు ENTనిపుణుడిని కలిస్తే మంచిది.

సాధారణంగా చేసే చెవి పరీక్షలు ఇవే:

ఎయిర్-కండక్షన్ టెస్టింగ్:

ఈ పరీక్షను ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ అని కూడా అంటారు. ఇందులో రోగికి హెడ్‌ఫోన్‌ అమర్చుతారు. టోన్ హెడ్‌ఫోన్‌లకు పంపుతారు. రోగి ఆ శబ్దాన్ని వినగానే చేయి పైకెత్తాలి లేదా ఇచ్చిన బటన్‌ను నొక్కాలి. రోగి వినికిడి సామర్థ్యం ఎలా ఉందో ఇది చూపిస్తుంది.

బోన్ కండక్షన్ టెస్టింగ్:

దీని ద్వారా రోగి లోపలి చెవి సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఇందులో చెవుల్లోకి చిన్నపాటి శబ్దాలను పంపి వినికిడి సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.

స్పీచ్ టెస్టింగ్:

ఇందులో పేషెంట్ ఇతరుల మాటలను ఏ మేరకు వింటాడో, అర్థం చేసుకోగలడో చెక్ చేస్తారు.

టైంపానోమెట్రీ టెస్ట్:

ఈ పరీక్ష చెవిపోటుపై గాలి ఒత్తిడిని కొలుస్తుంది. చెవిలో ద్రవం లేదా మైనపు చేరడం లేదని కూడా ఇది చూపిస్తుంది.

ఎకౌస్టిక్ రిఫ్లెక్స్ టెస్టింగ్:

ఇందులో మధ్య చెవి కండరాల కదలికను పరీక్షిస్తారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం