Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin D: మీరు విటమిన్ డి మందులు వాడుతున్నారా? అయితే మీరు ఆ దీర్ఘకాలిక వ్యాధి నుంచి సేఫ్

సూర్యరశ్మి ద్వారా శరీరం విటమిన్-డి పొందుతుంది. విటమిన్-డి శరీరంలోని ఇన్సులిన్, గ్లూకోజ్  జీవక్రియలో చాలా సాయం చేస్తుంది. విటమిన్-డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను నిపుణులు వివరిస్తున్నారు.

Vitamin D: మీరు విటమిన్ డి మందులు వాడుతున్నారా? అయితే మీరు ఆ దీర్ఘకాలిక వ్యాధి నుంచి సేఫ్
Vitamin D
Follow us
Srinu

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 09, 2023 | 4:38 PM

ప్రస్తుత కాలంలో అంతా వివిధ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. ఆయా లోపంతో ఎక్కువ రోజులు బాధపడకుండా వైద్యులను సంప్రదించి మందులు వాడుతున్నారు. ఇప్పుడు యువతతో పాటు మిడిల్ ఏజ్ ఉన్న వారు విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారు. దీంతో వారు విటమిన్ -డి సప్లిమెంట్స్ ను మందుల రూపంలో వాడుతున్నారు. విటమిన్-డి అంటే కొవ్వులో కరిగే విటమిన్. దీన్ని తీసుకున్న వారు ప్రీ డయాబెటిస్ లోని టైప్-2 డయాబెటిస్ నుంచి రక్షణ పొందుతున్నారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ విటమిన్ సహజంగా కూడా శరీరానికి అందుతుంది. సూర్యరశ్మి ద్వారా శరీరం విటమిన్-డి పొందుతుంది. విటమిన్-డి శరీరంలోని ఇన్సులిన్, గ్లూకోజ్  జీవక్రియలో చాలా సాయం చేస్తుంది. విటమిన్-డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను నిపుణులు వివరిస్తున్నారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

వివిధ పరిశోధనల్లో విటమిన్-డి లోపం ఉన్న వారు ఎక్కువగా టైప్-2 డయాబెటిస్ తో బాధపడుతున్నారని తేలింది. అయితే విటమిన్ -డి సప్లిమెంట్స్ వాడడం ద్వారా వారు డయాబెటిస్ ఇబ్బంది నుంచి బయట పడ్డారని నిపుణులు చెబుతున్నారు. మూడు సంవత్సరాల పాటు నిరంతరాయంగా చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. విటమిన్ సప్లిమెంట్ వాడిన వారిలో 22.7 శాతం మందికి, ప్లెసిబో వాడిన 25 శాతం మందికి మధుమేహం వచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఓ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 374 మిలియన్ల మంది ప్రీ డయాబెటిస్ తో బాధపడుతున్నారు. అయితే వీరు విటమిన్ డి వాడితే 10 మిలియన్ల మందికైనా డయాబెటిస్ రాకను ఆలస్యం చేస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే విటమిన్-డి సప్లిమెంట్స్ ను అధికంగా తీసుకుంటే వివిధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కచ్చితంగా వైద్యుల సూచన మేరకు విటమిన్-డి సప్లిమెంట్స్ ను వాడాలని నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

భార్య ఆరోగ్యంపై సోనూసూద్ ఎమోషనల్ ట్వీట్.. పరిస్థితి ఎలా ఉందంటే?
భార్య ఆరోగ్యంపై సోనూసూద్ ఎమోషనల్ ట్వీట్.. పరిస్థితి ఎలా ఉందంటే?
అందులో ఏ మాత్రం నిజం లేదు.. నా ఫోకస్ అంతా ఆ సినిమా పైనే.. 
అందులో ఏ మాత్రం నిజం లేదు.. నా ఫోకస్ అంతా ఆ సినిమా పైనే.. 
మఖానా,ఎండుద్రాక్ష కలిపి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
మఖానా,ఎండుద్రాక్ష కలిపి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
జియోలో బెస్ట్‌ ప్లాన్‌.. రూ. 1748 ప్లాన్‌తో ఏడాది వ్యాలిడిటీ..!
జియోలో బెస్ట్‌ ప్లాన్‌.. రూ. 1748 ప్లాన్‌తో ఏడాది వ్యాలిడిటీ..!
అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్‌పై ఈ క్రేజీ న్యూస్ విన్నారా ??
అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్‌పై ఈ క్రేజీ న్యూస్ విన్నారా ??
ఈ అమ్మాయి టాలీవుడ్ హీరోయిన్ కమ్ పొలిటికల్ లీడర్.. గుర్తు పట్టారా?
ఈ అమ్మాయి టాలీవుడ్ హీరోయిన్ కమ్ పొలిటికల్ లీడర్.. గుర్తు పట్టారా?
ఏపీలోని పాఠశాల విద్యార్థులు ఈ విషయం తెలుసుకుంటే మంచిది
ఏపీలోని పాఠశాల విద్యార్థులు ఈ విషయం తెలుసుకుంటే మంచిది
మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌.. మీ కళ్లకు ఏ కాంతి ఎక్కువ హానికరం?
మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌.. మీ కళ్లకు ఏ కాంతి ఎక్కువ హానికరం?
చరణ్ బర్త్ డే ట్రీట్ ఏంటో చూశారా.. ? లుక్ అదిరిపోయింది.
చరణ్ బర్త్ డే ట్రీట్ ఏంటో చూశారా.. ? లుక్ అదిరిపోయింది.
రాబోయే కాలానికి కాబోయే 'ముగ్గురు మొనగాళ్లు'..
రాబోయే కాలానికి కాబోయే 'ముగ్గురు మొనగాళ్లు'..