Radish Benefits: ముల్లంగి తీసుకుంటే కలిగే లాభాలేమిటో తెలుసా..? తెలిస్తే తక్షణం తినాలనుకుంటారు..

ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. అందుకు దీని వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు కూడా ఒక కారణం. మ‌రి ముల్లంగిని తిన‌డం..

Radish Benefits: ముల్లంగి తీసుకుంటే కలిగే లాభాలేమిటో తెలుసా..? తెలిస్తే తక్షణం తినాలనుకుంటారు..
Radish Benefits
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 09, 2023 | 11:51 AM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అందుకు వారు పాటిస్తున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానమే కారణమని చెప్పుకోవాలి. ముఖ్యంగా తినే ఆహారంలో పోషకాలు సరిపడా లేకపోవడం కూడా వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆంశం. అయితే పోషకాలతో కూడిన దుంపకూరలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఆలుగడ్డ, చిలగడదుంప, చామగడ్డతో పాటు ముల్లంగి వంటి దుంపకూరల్లో శరీరానికి కావలసిన ప్రోటీన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు, కేలరీలు లభిస్తాయి. అయితే చాలామంది ఇష్టంగా తినే ముల్లంగి ముక్కలను సాంబారులో కనిపిస్తే అస్సలు వదలరు. అయితే, ఈ ముల్లంగి కేవలం రుచికి మాత్రమే పరిమితం కాదండోయ్.. ఇందులో ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. మ‌న‌కు నిత్యం వండుకుని తినేందుకు అందుబాటులో ఉన్న అనేక కూర‌గాయల్లో ముల్లంగి కూడా ఒక‌టి. దీని ఘాటైన వాస‌న‌, రుచిని క‌లిగి ఉంటుంది. అందుక‌ని ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. అందుకు దీని వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు కూడా ఒక కారణం. మ‌రి ముల్లంగిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు కలిగే ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ముల్లంగిలో కాల్షియం, మెగ్నిషియం, ఐర‌న్‌, పొటాషియం, జింక్, విట‌మిన్ సి వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల ముల్లంగిని తింటే మ‌న శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది.
  2. ముల్లంగిలో ఉండే ఫైబ‌ర్ జీర్ణ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. అలాగే అధిక బ‌రువు కూడా త‌గ్గుతారు. శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది.
  3. ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగానే ఉంటాయి. అందువ‌ల్ల మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే క్యాన్స‌ర్ వ్యాధులు రాకుండా ఉంటాయి.
  4. గుండె స‌మస్య‌లు ఉన్న‌వారు నిత్యం ముల్లంగి తింటే ఎంతో మంచిది. అలాగే మ‌ధుమేహం ఉన్న‌వారు ముల్లంగిని తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. హైబీపీ, ఇన్‌ఫెక్ష‌న్లు ఉన్న‌వారు ముల్లంగి తింటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే లివర్‌లో ఉండే విష ప‌దార్థాలు బ‌య‌టకు వెళ్లిపోతాయి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం