Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS 1st Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. భారత్ తరఫున ఇద్దరు ఆరంగేట్రం.. తుది జట్టు వివరాలివే..

టీ20 స్టార్  సూర్య కుమార్ యాదవ్, ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ టెస్ట్‌ టీమ్‌లోకి వచ్చారు. ఇక సూర్య కుమార్ యాదవ్‌కు టీమిండియా దిగ్గజం, మాజీ క్రికెటర్..

IND vs AUS 1st Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. భారత్ తరఫున ఇద్దరు ఆరంగేట్రం.. తుది జట్టు వివరాలివే..
Ind Vs Aus 1st Test Playing
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 09, 2023 | 9:48 AM

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగబోయే తొలి టెస్ట్‌కు సమయం ఆసన్నమయింది. మరి కొద్ది నిముషాల్లో నాగ్‌పూర్‌లోని విదర్భ స్టేడియంలో నాలుగు టెస్టు‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్ ప్రారంభమయింది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముందుగా ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్.. బ్యాటింగ్‌ ఎంచుకోవడంతో  టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఇద్దరు యువ ఆటగాళ్లు ఆరంగేట్రం చేశారు. వారు టీ20 స్టార్  సూర్య కుమార్ యాదవ్, ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ టెస్ట్‌ టీమ్‌లోకి వచ్చారు. ఇక సూర్య కుమార్ యాదవ్‌కు టీమిండియా దిగ్గజం, మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రీ టెస్ట్ క్యాప్‌ను అందజేయగా.. కేఎస్ భరత్‌కు టీమ్ సీనియర్ ఆటగాడు, నయావాల్ ఛతేశ్వర్ పుజారా టెస్ట్ క్యాప్ అందించాడు.

అయితే సూర్యకుమార్‌ ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. దాంతో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయనున్నాడు. సూర్యకుమార్‌ ఎంట్రీతో ఇటీవల సెంచరీలు బాదిన శుభ్‌మన్ గిల్‌కు చోటు గళ్ళైతైంది. భరత్‌ రాకతో ఇషాన్ కిషన్ కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. ఇంకా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) 2023 ఫైనల్‌లో  స్థానాన్ని ఆశిస్తున్న భారత్‌కు ఈ బోర్డర్‌-గవాస్కర్ సిరీస్‌ మరింత కీలకం కానుంది. ఈ సిరీస్‌లో కనీసం మూడు టెస్టులు గెలిస్తేనే.. టీమిండియా డబ్ల్యూటీసీ టైటిల్‌ సమరానికి అర్హత సాధించగలుగుతుంది. దాంతో భారత్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్న ఆస్ట్రేలియా కూడా ఈ సిరీస్ కీలకమే. అంతేకాదు గత పరాభవాలకు బదులు తీర్చుకోవాలని చూస్తోంది కంగారు జట్టు.

ఇవి కూడా చదవండి

IND vs AUS జట్టు వివరాలు.. 

ఆస్ట్రేలియా ప్లేయింగ్ X1:డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, మాట్ రెన్షా, పీటర్ హ్యాండ్స్కాంబ్, అలెక్స్ కారీ (వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్ (కెప్టెన్‌), నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..