R Ashwin: రికార్డుల వేటలో పడిన అశ్విన్.. ఆసీస్ సిరీస్‌లో ఒక్కరిని ఔట్ చేస్తే ఆ లిస్ట్‌లోకి.. 7 వికెట్లు తీస్తే హర్భజన్ కంటే పైకి..
అరుదైన క్లబ్‌లో చేరేందుకు ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. నాగ్‌పుర్ టెస్టులో అశ్విన్ ఒక్క వికెట్ పడగొడితే.. టెస్టుల్లో 450 వికెట్లు..
నాగ్‌పూర్‌లోని విదర్భ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నేటి(ఫిబ్రవరి 9) నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 ప్రారంభమవనుంది. ఈ నేపథ్యంలో ఇదు జట్టలోని స్టార్ ప్లేయర్స్ మరోసారి సత్తా చాటాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక టీమిండియా ఈ సిరీస్‌ను గెలిస్తే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్స్‌లో భారత్ చోటు దక్కించుకోవచ్చు. దీంతో క్రికెట్ అభిమానుల దృష్టి అంతా ఇప్పుడు తొలి టెస్ట్ మ్యాచ్‌పైనే ఉంది. ఇంకా ఈ సిరీస్‌లోని నాలుగు మ్యాచ్‌లలో మన ఆటగాళ్లు రాణిస్తే పలు రికార్డులు బద్దలు కావడం ఖాయం. అయితే నాగ్‌పుర్ టెస్టులో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన మైలురాయి అందుకునే అవకాశముంది. అందుకోసం అతను ఒకే ఒక్క వికెట్ తీయాల్సి ఉంది. ఇప్పటివరకు 88 టెస్టులు ఆడిన అశ్విన్ .. 449 వికెట్స్ పడగొట్టాడు. అరుదైన క్లబ్‌లో చేరేందుకు ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. నాగ్‌పుర్ టెస్టులో అశ్విన్ ఒక్క వికెట్ పడగొడితే.. టెస్టుల్లో 450 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ టెస్టుల్లో 450 వికెట్లు మైలురాయిని అందుకున్న 9వ బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కుతాడు.
అంతేకాక భారత్ తరఫున టెస్టుల్లో 450 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గానూ అశ్విన్ రికార్డు సృష్టిస్తాడు. ఈ జాబితాలో భారత లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే(619) మొదటి స్థానంలో.. ఇంకా 450 వికెట్లు పడగొట్టిన ఒకే ఒక్క భారత బౌలర్‌గా ఉన్నాడు. అయితే టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. మురళీధరన్ టెస్టుల్లో 800 వికెట్స్ పడగొట్టాడు. ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్(708), ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్(675), భారత దిగ్గజం అనిల్ కుంబ్లే(619), ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్(566) టాప్ 5లో ఉన్నారు. ఈ జాబితాలో మెక్ గ్రాత్(563), కోట్నీ వాల్ష్(519), నాథన్ లైయన్(460) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇదే కాక.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 లో అశ్విన్ మరో ఏడు వికెట్లు పడగొడితే.. టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (95) రికార్డును బద్దలు కొడతాడు. అశ్విన్ 7 వికెట్లు తీస్తే హర్భజన్‌ని అధిగమించి టెస్టుల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే (111) మొదటి స్థానంలో ఉన్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..