AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dark Chocolates: ఆ వ్యాధులన్నీ డార్క్ చాక్లెట్‎తో ఫసక్..! రోజులో ఎంత తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

గుండె ఆరోగ్యానికి ఈ డార్క్ చాక్లెట్ ఎంతో బాగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా డార్క్ చాక్లెట్స్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చో తెలుసుకుందాం.

Dark Chocolates: ఆ వ్యాధులన్నీ డార్క్ చాక్లెట్‎తో ఫసక్..! రోజులో ఎంత తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
Dark Chocolate Health BenefitsImage Credit source: TV9 Telugu
Follow us
Madhavi

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 09, 2023 | 11:58 AM

Dark Chocolates Health Benefits:  మీకు చాక్లెట్ తినడం ఇష్టం లేకున్నా..రోజులో కొంత డార్క్ చాక్లెట్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరం చేస్తుంది. ఫలితంగా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి ఈ డార్క్ చాక్లెట్ ఎంతో బాగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా డార్క్ చాక్లెట్స్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చో తెలుసుకుందాం.

డార్క్ చాక్లెట్…మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయి. కోకో చెట్ల నుంచి తీసిన విత్తనాలతో ఈ డార్క్ చాకెట్లను తయారు చేస్తారు. ఇందులో ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు కోకోలో ఫ్లేవనాయిడ్స్ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం డార్క్ చాక్లెట్ ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గించేందుకు సహాయపడతాయని తేలింది.

1. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది:

డార్క్ చాక్లెట్స్ క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతాయి. డార్క్ చాక్లెట్స్ లోని కొన్ని సమ్మేళనాలు, ప్రత్యేకంగా ఫ్లేవనోల్స్, గుండె జబ్బులకు రెండు ప్రధాన ప్రమాద కారకాలైన అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‎ను ప్రభావితం చేస్తుంది. డార్క్ చాక్లెట్ రక్త సరఫరాను మెరుగుపరచడంతోపాటు, రక్తం గడ్డకట్టకుండా సహాయపడుతుంది. వారానికి రెండు లేదా మూడుసార్లు ఈ డార్క్ చాక్లెట్ తింటే రక్తపోటును అధిగమించేలా చేస్తుంది.

2. డిప్రెషన్‎కు చెక్:

డార్క్ చాక్లెట్‎తో డిప్రెషన్‎కు చెక్ పెట్టవచ్చు. రోజుకు 24గ్రాములు లేదా అంతకంటే తక్కువ డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల యాంటిడిప్రెసెంట్ ప్రభావం తగ్గుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇది ఫ్లేవనాయిడ్స్‎ను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే థియో‎బ్రోమిన్ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఎన్-ఎసిల్ ఇథనోలమైన్స్ ( యూఫోరిక్ ప్రభావాన్ని కలిగి ఉండే కొవ్వు ఆమ్లం) ఫెనిలేథైలమైన్ ( డోపమైన్ ను ప్రేరేపిస్తుంది) ఇవన్నీ కూడా డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

3. రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

ఈ డార్క్ చాక్లెట్ లో ఫాలిఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరిచే యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

4. బరువును తగ్గించేందుకు.. :

అధిక బరువుతో బాధపడేవారు డార్క్ చాక్లెట్ తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు బరువును తగ్గించడంతోపాటు జీవక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాదు కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది. భోజననానికి 20 నిమిషాల ముందు తింటే కోరికలను అరికడుతుంది. డార్క్ చాక్లెట్‎లో ఉండే మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు శరీర నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారికి డార్క్ చాక్లెట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి..