Smartphone vision syndrome: స్మార్ట్ ఫోన్ తో కళ్లకు కష్టకాలం.. ఏకంగా చూపు కోల్పోయే ప్రమాదం..

మహిళల్లో స్మార్ట్ ఫోన్ అధికంగా వినియోగిస్తున్న వారిలో దృష్టి లోపం వస్తోందని వివరిస్తున్నారు. ప్రధానంగా రాత్రి సమయాల్లో లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఫోన్ వాడితే అది కంటిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

Smartphone vision syndrome: స్మార్ట్ ఫోన్ తో కళ్లకు కష్టకాలం.. ఏకంగా చూపు కోల్పోయే ప్రమాదం..
Phone
Follow us
Madhu

|

Updated on: Feb 09, 2023 | 1:00 PM

స్మార్ట్ ఫోన్.. ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చిన సాధనం. దీని ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అతిగా వాడితే అంతే అనర్థాలున్నాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్లీ పడకపై చేరేంత వరకూ.. ఇంకా చెప్పాలంటే నిద్ర పట్టేంత వరకూ చేతిలో ఫోన్ ఆడుతూ ఉండాల్సిందే. అయితే దీని ద్వారా అనేక అనారోగ్యాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో స్మార్ట్ ఫోన్ అధికంగా వినియోగిస్తున్న వారిలో దృష్టి లోపం వస్తోందని వివరిస్తున్నారు. ప్రధానంగా రాత్రి సమయాల్లో లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఫోన్ వాడితే అది కంటిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ లైవ్ కేస్ స్టడీని హైదారాబాద్ కు చెందిన ఓ ప్రముఖ వైద్యుడు తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇది కేస్..

హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల మహిళ తన మొబైల్ ఫోన్‌కు అడిక్ట్ అయ్యింది. చీకటిలో కూడా గంటల తరబడి అదే పనిగా ఫోన్ లో నిమగ్నమై ఉండేది. దీంతో ఆమెకు తీవ్రమైన దృష్టిలోపం వచ్చింది. దాదాపు ఒకటిన్నర సంవ్సరాలుగా ఆమె ఈ సమస్యతో బాధపడుతోంది. ఆమె అపోలో హాస్పటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కుమార్ ను సంప్రదించింది. దీంతో ఆ డాక్టర్ ఆమెకు కలిగిన ఇబ్బందిని, లక్షణాలు, అందించిన చికిత్సను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. మంజు అనే మహిళ దాదాపు ఒకటిన్నర ఏళ్లుగా తీవ్రమైన దృష్టి సమస్యలతో బాధపడుతోందన్నారు. ఏ వస్తువు సరిగా కనిపించేది కాదు. ప్రకాశవంతమైన వస్తువులు చూడలేకపోయేది. కొన్ని వస్తువులు బ్లర్ గా, మరికొన్ని జిగ్ జాగ్ లైన్లు లా కనిపిస్తుండేది. ఏ వస్తువును సరిగా గుర్తించలేకపోయేది. దీంతో డాక్టర్ ఆమె జీవన శైలి, అలవాట్లు, సెల్ ఫోన్ వాడకం వంటి వివరాలు తెలుసుకొని ఆమెకు స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చినట్లు నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

కారణమేంటి అంటే..

ఆమె తన ప్రత్యేక అవసరాలు గల బిడ్డను చూసుకోడానికి తన బ్యూటీషియన్ ఉద్యోగాన్ని విడిచిపెట్టింది. ఆ తర్వాత చాలా గంటల పాటు తన బిడ్డ అవసరాల కోసం ఎక్కువగా ఫోన్ లో సెర్చ్ చేస్తూ ఉండేది. ముఖ్యంగా బిడ్డ నిద్రపోయిన తర్వాత రాత్రి సమయంలో లైట్లు ఆఫ్ చేసి ఫోన్ ఎక్కువగా వినియోగిస్తూ ఉండేది. దీని కారణంగానే ఈ స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ వచ్చిందని నిర్ధారణకు వచ్చారు. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లు లేదా టాబ్లెట్‌లు వంటి పరికరాలను దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల కంటికి సంబంధించిన వివిధ ఇబ్బందులు తలెత్తుతాయి. వీటిని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (CVS) లేదా డిజిటల్ విజన్ సిండ్రోమ్ అని అంటారని డాక్టర్ కుమార్ వివరించారు.

డాక్టర్ చేసిన చికిత్స ఏంటి?

ఈ వ్యాధిని గుర్తించిన డాక్టర్.. ఆమెకు ఎటువంటి మందులు ఇవ్వలేదు. మరిన్ని పరీక్షలు చేసి, మందులు ఇవ్వాలని ఆమె వైద్యుడిని అడినప్పటికీ ఆయన మాత్రం మందులు ఏమి సూచించలేదు. కానీ జీవన శైలిని మార్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. దీంతో ఆ మహిళ తన ఫోన్ వాడకాన్ని పూర్తిగా తగ్గించింది. తిరిగి ఓ నెల రోజుల తర్వాత తిరిగి వచ్చిన ఆ మహిళ తన కంటి చూపు ప్రస్తుతం బాగానే ఉందని చెప్పింది. దీంతో దాదాపు 18 నెలలపాటు వేధించిన సమస్య తొలగిపోయింది. ఇప్పుడు ఆమెకు అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మీ కళ్ళను ఎలా రక్షించుకోవాలి..

  • స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్‌ను ఎలా నివారించవచ్చనే దానిపై డాక్టర్ కొన్ని సూచనలను కూడా పంచుకున్నారు. అవేంటంటే..
  • డిజిటల్ పరికరాల స్క్రీన్‌లను ఎక్కువసేపు చూడకుండా ఉండాలి. లేకుంటే ఇది తీవ్రమైన, దృష్టి సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.
  • 20-20-20 నియమం అని కూడా పిలువబడే నియమాన్ని పాటించాలి. అంటే డిజిటల్ స్క్రీన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు, 20 అడుగుల దూరంలో ఉండాలి. అలాగే ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల విరామం తీసుకోవాలి.
  • మీరు పని చేస్తున్న లేదా కంప్యూటర్ లేదా ఫోన్ స్క్రీన్‌ని చూస్తున్న గది బాగా వెలుతురు ఉండేలా చూసుకోండి.
  • పరిస్థితి మరింత దిగజారడానికి ముందే మీరు స్వల్పంగా ఒత్తిడిని అనుభవిస్తున్నప్పుడే వెంటనే కంటి పరీక్షలు చేయించుకోండి.
  • అధిక రిజల్యూషన్ స్క్రీన్ లను ఉపయోగిస్తే మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..