Valentines Week: 500 ఏళ్లనాటి యదార్ధ ప్రేమ కథ.. కదిరిలోని ఈ ప్రేమికుల సమాధులను దర్శించుకుంటే ప్రేమ ఫలిస్తుందని నమ్మకం..
సరైన ప్రాచుర్యం లేక శిధిలాల కింద మసకబారిపోతున్న ఎందరో గొప్ప ప్రేమికులున్నారు. అలాంటి అమర ప్రేమికుల జంటల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఉన్నారు. 500 ఏళ్ల నాటి యదార్ధ ప్రేమ గాథ. వ్యాపారం కోసం భారత దేశం వచ్చిన ఓ యువకుడు.. ఇక్కడ యువతిని ప్రేమించాడు..
ప్రేమ అంటే అందరికి ముందుగా గుర్తుకొచ్చేది.. దేవదాస్ పార్వతి, లైలా మజ్ను, రోమియో జూలియట్ వంటి అమర ప్రేమికుల కథలే గుర్తుకొస్తాయి. అయితే చరిత్ర చెప్పని నిజమైన అద్భుతమైన ప్రేమికులు ఎందరో ఉన్నారు. మన చుట్టుపక్కన ఉంటూ.. సరైన ప్రాచుర్యం లేక శిధిలాల కింద మసకబారిపోతున్న ఎందరో గొప్ప ప్రేమికులున్నారు. అలాంటి అమర ప్రేమికుల జంటల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఉన్నారు. 500 ఏళ్ల నాటి యదార్ధ ప్రేమ గాథ. వ్యాపారం కోసం భారత దేశం వచ్చిన ఓ యువకుడు.. ఇక్కడ యువతిని ప్రేమించాడు.. పెద్దలు ఒప్పుకోక పోవడంతో.. నిద్రాహారాలు మాని ప్రాణాలను విడిచి పెట్టాడు. తనను ప్రేమించి ప్రాణాలు పోగొట్టుకున్న అతడిని తలచుకుంటూ ఆ యువతి ప్రాణాలు విడిచింది. అనంతరం ఇద్దరినీ ఓకె చోట సమాధి చేశారు. నేటికీ ప్రేమికులు ఈ సమాధిని దర్శించుకుంటే తమ ప్రేమ ఫలిస్తోందని నమ్మకం. మరికొన్ని రోజుల్లో ప్రేమికుల రోజుని జరుపుకోవడనికి ప్రేమికులు రెడీ అవుతున్నారు. వాలంటైన్ వీక్ లో భాగంగా శతాబ్దాల క్రితం జరిగిన యదార్ధ ప్రేమ గురించి ఈరోజు తెలుసుకుందాం..
సుమారు 500 ఏళ్ల క్రితం.. పర్షియా దేవస్థుడు అంటే ఇప్పటి ఇరాన్ దేశం నుంచి వ్యాపారం నిమిత్తం భారత దేశానికి వచ్చాడు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా అనంతపురం జిల్లాకు చేరుకున్నాడు. ఆ సమయంలో కదిరి నరసింహా దేవాలయంలో కార్తికమాసం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా తెల్లవారు జామున పట్టు వస్త్రాలతో స్వామివారి దర్శనానికి ఓ యువతి ఆలయ ప్రాంగణానికి వచ్చింది. అప్పుడు ఆ యువతి అందాన్ని చూసి ముగ్దుడైన ఆ యువకుడు తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు.
ఆ యువతి పేరు రంగరాయల కూతురైన చంద్రవదన… ఆ యువకుడి పేరు.. మోహియార్. పేరుకి తగినట్లే అత్యంత అందాల రాశి అయిన చంద్రవదనని అనుసరిస్తూ.. ఎక్కడికి వెళ్తే అక్కడకు వెళ్లడం మొదలు పెట్టాడు మోహియార్. తనని అంతగా ఇష్టపడుతున్న మోహియార్ ని చూసి చంద్రవదన కూడా అతడిని ప్రేమించడం మొదలు పెట్టింది. కదిరి పట్ణణం పాలేగాళ్ల గారాల పట్టి .. దీంతో ఇద్దరు కలుసుకోవడం అత్యంత కష్టంగా మారింది. దీంతో తమ స్నేహితుల ద్వారా ఒకరికొకరు సందేహాలను పంపుకునేవారు.
చివరికి తమ ప్రేమ గురించి పెద్దల ముందు పెట్టారు. అప్పట్లో సమాజంలో కట్టుబాట్లు అత్యంత కఠినంగా ఉండేవి. దీంతో వీరి ప్రేమను ప్-పెద్దలు తిరస్కరించారు. దేశం కానీ దేశం.. వేరే మతానికి చెందిన తమ ఇంటి ఆడపిల్లను ఇవ్వమని తేల్చి చెప్పేశారు. ఇద్దరూ కలుసుకోకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దీంతో ఒకరికోసం ఒకరు.. నిద్రహారాలు మానేశారు.. కాలక్రమంలో మోహియార్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మరణించాడు. తన కోసం ప్రాణాలు పోగొట్టుకున్న ప్రియుడిని తలచుకుంటూ.. చంద్రవదన కూడా తుదిశ్వాస విడిచింది.
ప్రేమికుల మరణ వార్త విన్న కదిరి పట్టణ వాసుల్లో చలనం వచ్చింది. దీంతో ఇద్దరి సమాధులను ఓకే చోట ఏర్పాటు చేశారు. . ఈ ప్రాంతంలో అనేక మంది తమ పిల్లలకు చంద్ర మోహియార్ అనే పేర్లను పెట్టుకుని అమర ప్రేమికులను ఇప్పటికీ తలుచుకుంటూనే ఉన్నారు. నేటికీ వీరిద్దరి సమాధులను ఎంతో మంది యువతి, యువకులను దర్శించుకుంటారు. వీరి సమాధి వద్ద మట్టిని తాకితే తమ ప్రేమ ఫలిస్తుందని ప్రేమికులు నమ్ముతారు. తమ నమ్మకం నిజం అయిదని చాలామంది ప్రేమికులు చెబుతారు. అయితే కాలక్రమంలో వీరి ప్రేమ కాలగర్భంలో కలిసిపోతుంది. దీంతో సందర్శకుల తాకిడి కూడా తగ్గిపోయింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..