AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OnePlus Pad: మొట్టమొదటి ట్యాబ్‌ను లాంచ్ చేసిన వన్‌ప్లస్.. ఊహించనన్ని అద్భుతమైన ఫీచర్లు.. ధర ఎంతంటే..?

భారత మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వన్‌ప్లస్ ప్యాడ్ బ్యాటరీ సామర్థ్యం ఎంతో మీకు తెలుసా..? తెలిస్తే వామ్మో అనాల్సిందే. ఎందుకంటే వన్‌ప్లస్..

OnePlus Pad: మొట్టమొదటి ట్యాబ్‌ను లాంచ్ చేసిన వన్‌ప్లస్.. ఊహించనన్ని అద్భుతమైన ఫీచర్లు.. ధర ఎంతంటే..?
Oneplus Pad
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 09, 2023 | 12:29 PM

Share

OnePlus Pad: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను లాంచ్ చేసింది. 144hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే 11 అంగుళాల డిస్‌ప్లేతో వస్తున్న ఈ ట్యాబ్‌లో వెనుకవైపు ఒకే కెమెరాను అందించనుంది వన్‌ప్లస్ కంపెనీ. అది కూడా సరిగ్గా మధ్యలో ఆ కెమెరా ఉండడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక వన్‌ప్లస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్యాడ్‌ను ఎక్కువ సేపు ఉపయోగించినా.. దానిని పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా వినియోగదారులు ఈ ప్యాడ్‌లో సౌకర్యవంతంగా పని చేయగలుగుతారు. భారత మార్కెట్‌లోకి తాజాగా లాంచ్ అయిన ఈ వన్‌ప్లస్ ప్యాడ్ బ్యాటరీ సామర్థ్యం ఎంతో మీకు తెలుసా..? తెలిస్తే వామ్మో అనాల్సిందే. ఎందుకంటే వన్‌ప్లస్ ప్యాడ్ 9,510 mAh బ్యాటరీని కలిగి ఉంది. 67W సూపర్ వూక్ చార్జింగ్‌కు కూడా సపోర్ట్‌ చేస్తుంది ఈ ట్యాబ్. అంటే 60 నిమిషాల్లోనే ఒకటి నుంచి 90 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చన్న మాట.

వన్‌ప్లస్ ప్యాడ్ స్పెసిఫికేషన్లు:

మీడియాటెక్ డైమెన్సిటీ 9000 SoC ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్‌లనువన్‌ప్లస్ ప్యాడ్‌లో అందించింది వన్‌ప్లస్ కంపెనీ. ఇంకా ఇందులో 144 Hz రిఫ్రెష్ రేట్, 7: 5 యాస్పెక్ట్ రేషియో, 2800 x 2000 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడిన 11.61-అంగుళాల స్క్రీన్‌ కూడా ఉంది. అంతేకాక వన్‌ప్లస్ ప్యాడ్ ఫైల్ షేరింగ్, మల్టీ టాస్కింగ్ కోసం స్మార్ట్ సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది. వన్‌ప్లస్ ప్యాడ్‌లోని ఆడియో సిస్టమ్ కోసం డాల్బీతో వన్‌ప్లస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో మీరు గొప్ప సౌండ్‌ను అందించే నాలుగు స్పీకర్లను కూడా పొందుతారు. సింగిల్ హాలో గ్రీన్ కలర్‌లో లాంచ్ అయిన వన్‌ప్లస్ ప్యాడ్ ధరను అయితే దాని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే ఇంటర్నెట్‌లో అందించిన సమాచారం ప్రకారం ఇది రూ.24,999లకు అందుబాటులో ఉండనుంది. ఖచ్చితమైన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌పై చూడవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..