Zero Account Opening: ఇంట్లో నుంచే సేవింగ్స్ ఖాతా పొందే అవకాశం.. నో మినిమం బ్యాలెన్స్..
ఇంట్లో నుంచే ఖాతా తెరుచుకునే వెసులబాటును ఇస్తున్నాయి. పైగా ఖర్చు లేకుండా జీరో అకౌంట్ గా ఆపరేట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఏ బ్యాంకు ఆన్ లైన్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయడానికి వీలు కల్పిస్తుందో ఓ సారి తెలుసుకుందాం.
ప్రస్తుతం అందరికీ బ్యాంకు ఖాతాలు అవసరం పెరిగింది. కరోనా తర్వాత ఇండియా డిజిటల్ బ్యాంకింగ్ రంగం ఊపందుకుంది. అందరూ యూపీఐ సహాయంతో ఖాతాల్లో నుంచే టాన్స్ యాక్షన్స్ చేస్తున్నారు. అయితే ఎన్ని సదుపాయాలు ఉన్నా కొత్త బ్యాంకు అకౌంట్ తీసుకోవడానికి మాత్రం కచ్చితంగా బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరికీ ఖాళీ ఉండడం లేదు. అలాంటి పరిస్థితుల్లో బ్యాంకుకు వెళ్లి ఫామ్ ను నింపి వారు అడిగిన ప్రూఫ్స్ అందించి, వాళ్లకు సమాధానం ఇచ్చి బ్యాంకు అకౌంట్ తీసుకోవడం ఈ రోజుల్లో కుదిరే పని కాదు. పైగా అందులో ఎంతో కొంత సొమ్ము మినిమం డిపాజిట్ కింద ఉంచాలి. కాబట్టి ఇది అయ్యే పని కాదంటూ ప్రతి ఒక్కరూ మదనపడుతుంటారు. కానీ మారుతున్న కాలం ప్రకారం బ్యాంకింగ్ రంగంలో కూడా మార్పులు వచ్చాయి. ఇంట్లో నుంచే ఖాతా తెరుచుకునే వెసులబాటును ఇస్తున్నాయి. పైగా ఖర్చు లేకుండా జీరో అకౌంట్ గా ఆపరేట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఏ బ్యాంకు ఆన్ లైన్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయడానికి వీలు కల్పిస్తుందో ఓ సారి తెలుసుకుందాం.
కోటక్ మహీంద్రా బ్యాంక్
కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆన్ లైన్ లో ఖాతాను పొందే అవకాశం కల్పిస్తుంది. అలాగే మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయాల్సిన అవసరం లేకుండా జీరో అకౌంట్ ను అందిస్తుంది. పైగా సేవింగ్స్ ఖాతాలో ఉంచి సొమ్ముకు 4 శాతం వడ్డీనిక కూడా ఇస్తుంది. నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా డబ్బును పంపుకునే, స్వీకరించే వెసులుబాటు కూడా ఉంది. కోటాక్ బ్యాంకుల్లో ఆన్ లైన్ లో నాలుగు రకాల ఖాతాలను పొందవచ్చు. కోటక్ 811 లైట్, కోటక్ 811 లిమిటెడ్ కేవైసీ, కోటక్ 811 ఫుల్ కేవైసీ, కోటక్ 811 ఎడ్జ్ అనే ఖాతాలను పొందవచ్చు. 18 సంవత్సరాలు నిండి వారు ఎవరైనా ఆధార్, ఇతర ప్రూఫ్స్ ఆన్ లైన్ లోనే సమర్పించి ఖాతాలను పొందవచ్చు. మరిన్ని వివరాలను కోటక్ యాప్ ను లేదా కోటక్ వెబ్ సైట్ లో పొందవచ్చు.
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈ బ్యాంక్ ఆర్బీఐ వద్ద రిజిస్టరైంది. అలాగే పొదుపు ఖాతాపై 7.25 శాతం వడ్డీని అందిస్తుంది. ఏయూ 0101 యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ అపరిమిత ఆర్టీజీఎస్, నెఫ్ట్ బదిలీలను చేసుకోవచ్చు. ఇది జీరో బ్యాంక్ అకౌంట్. కానీ, ప్లాటినం రూపే డెబిట్ కార్డును అందిస్తుంది. ఇతర వివరాలకు ఏయూ యాప్ లో కానీ, వెబ్ సైట్ ను సందర్శిస్తే సరిపోతుంది.
ఇండస్ ఇండ్ బ్యాంక్
ఈ బ్యాంక్ కూడా శాఖను సందర్శించకుండా బ్యాంక్ అకౌంట్ ను అందిస్తుంది. ఈ బ్యాంకులో రెండు రకాల జీరో బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. ఇండస్ డిజి-స్టార్ట్, ఇండస్ డిలైట్. ఇతర బ్యాంకుల్లా కాకుండా ఈ బ్యాంకులో జీరో అకౌంట్ ఓపెన్ చేయాలంటే రూ.10,000 ప్రారంభ నిధులు కావాలి. అయితే అకౌంట్ ఓపెన్ చేయగానే ఆ డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ బ్యాంకులో వడ్డీ రేట్లు, డెబిట్ కార్డు చార్జీలు వేరుగా ఉన్నాయి. కాబట్టి మరిన్ని వివరాలకు బ్యాంకు వెబ్ సైట్ ను సందర్శించడం ఉత్తమం.
ఎఫ్ఐ మనీ
ఎఫ్ఐ మనీ బ్యాంకు కాదు. దీనికి భౌతిక శాఖ లేదు. ఇది బ్యాంక్ గా పని చేసే ప్రస్తుత బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలపై రూపొందించిన యాప్. ఎఫ్ఐ బ్యాంకింగ్ భాగస్వామి ఫెడరల్ బ్యాంక్. ఈ యాప్ ద్వారా డెబిట్ కార్డు ద్వారా నెలకు ఐదు ట్రాన్స్ యాక్షన్లు ఫ్రీగా చేసుకోవచ్చు. ఎఫ్ఐ మనీ కేవలం ప్రస్తుతం భారతదేశంలో పని చేసే వర్కింగ్ ప్రొఫెనల్స్ కు మాత్రమే ఖాతా తెరవవచ్చు.
జూపిటర్ బ్యాంక్
జూపిటర్ బ్యాంక్ అంటే మరో నియో బ్యాంక్. ఇది కూడా ఫెడరల్ బ్యాంక్ ద్వారానే పని చేస్తుంది. ఇది వంద శాతం డిజిటల్ బ్యాంకింగ్ సేవను అందించే స్మార్ట్ ఖాతాతో పని చేస్తుంది. ఇది జీరో బ్యాలెన్స్ ఖాతా కాబట్టి కనీస సగటు బ్యాలెన్స్ ను నిర్వహించాల్సిన అవసరం ఉండదు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం