AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FASTag Recharge: ఫాస్ట్‌ట్యాగ్‌ రీఛార్జ్ చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త.. లేకపోతే లక్షల రూపాయలకే ఎసరు..

FASTag Recharge: ఇంటర్నెట్ మన జీవితాలనే మార్చేసింది అనడం కంటే తన వశం చేసేసుకుందనడం సరిపోతుంది. ఇక ఈ ఇంటర్‌నెట్ యుగంలో సైబర్‌ క్రైమ్‌ కేసులు నానాటికీ..

FASTag Recharge: ఫాస్ట్‌ట్యాగ్‌ రీఛార్జ్ చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త.. లేకపోతే లక్షల రూపాయలకే ఎసరు..
Fastag Recharge Fraud
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 04, 2023 | 9:20 AM

Share

FASTag Recharge: ప్రస్తుతం ఏ పనైనా టెక్నాలజీ కల్పించిన సౌలభ్యంతో ఇట్టే అయిపోతుంది. చదువుల నుంచి ఉద్యోగాల వరకూ.. పుట్టుక నుంచి మరణం వరకూ అంతా టెక్నాలజీమయం. అలా టెక్నాలజీ వలన లభించిన మరో సౌకర్యమే ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ మన జీవితాలనే మార్చేసింది అనడం కంటే తన వశం చేసేసుకుందనడం సరిపోతుంది. ఇక ఈ ఇంటర్‌నెట్ యుగంలో సైబర్‌ క్రైమ్‌ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. మన బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొట్టేందుకు హ్యాకర్లు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే సైబర్ మోసానికి సంబంధించి ఒక కొత్త కేసు తెరపైకి వచ్చింది. అందరినీ షాక్ గురిచేపే ఈ కేసులో.. ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష దోచేసారు సైటర్ మోసగాళ్లు. అసలు వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కర్ణాటకకు చెందని ఓ వ్యక్తి  ఫాస్ట్‌ట్యాగ్‌ని రీఛార్జ్ చేస్తున్నప్పుడు ఏకంగా రూ.లక్ష కోల్పోయాడు. అదేలా అంటే.. ఉడిపిలోని బ్రహ్మవరానికి చెందిన ఫ్రాన్సిస్ పియస్ తన కారులో మంగళూరుకు వెళ్తున్నాడు. టోల్ ప్లాజాకు చేరుకున్నప్పుడు తన ఫాస్ట్‌ట్యాగ్ కార్డ్‌లో డబ్బు తక్కువగా ఉందని గమనించిన అతను.. టోల్ చెల్లించడానికి హెల్ప్‌లైన్ నంబర్‌లను వెతికాడు. ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌ చేయగా ఓ నంబర్‌ కనిపెట్టి రీఛార్జ్‌ చేసుకునేందుకు ఫోన్‌ చేశాడు. ఈ కాల్ తనను మోసానికి గురి చేస్తుందని అతనికి కూడా తెలియదు. పయాస్ ఫోన్ చేయగా అవతలి వ్యక్తి తనను తాను Paytm Fastag ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. రీఛార్జ్ చేయడానికి ఫోన్‌కి వచ్చిన OTPని చెప్పాలని పాయస్‌ని కోరాడు.

అవతలి వ్యక్తిని నమ్మిన పయాస్ తనకు వచ్చిన OTPని షేర్ చేశాడు. కొన్ని నిమిషాల తర్వాత బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కట్‌ అయిన మెస్సేజ్‌లు వరుసగా వస్తున్నాయి. ముందుగా రూ.49,000 డెబిట్ కాగా, తర్వాత రూ.19,999, రూ.19,998, రూ.9,999, రూ.1000 డెబిట్ అయ్యాయి. పాయస్ మొత్తం రూ.99,997 నష్టపోయాడు. అసలు విషయం అంటే.. మోసపోయానని తెలుసుకున్న పయాస్.. వెంటనే ఉడిపి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు.

ఇవి కూడా చదవండి

అయితే మీరు గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే.. కస్టమర్ కేర్‌కు కాల్ చేసినప్పుడు ఏ ప్రతినిధి కూడా మీ బ్యాంక్ వివరాలను అడగరు. కాబట్టి OTP లేదా బ్యాంక్ వివరాలను ఎవ్వరికీ చెప్పకూడదు. వెబ్‌సైట్ నిజమైనదా లేదా నకిలీదా అని తనిఖీ చేయడానికి సురక్షిత బ్రౌజింగ్ పోర్టల్‌ను ఉపయోగిస్తే తెలుస్తుంది. FASTag రీఛార్జ్ చేయడానికి Paytm, ZeePay, PhonePeతో సహా ఏదైనా UPI యాప్‌ని ఉపయోగించి రీఛార్జ్ చేసుకోవచ్చు.

మరిన్ని హ్యూమన్ ఇంటరెస్టింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..