Kanha Music Festival: ముగిసిన మ్యూజికల్ ఫెస్టివల్.. సంగీత ప్రియులను అలరించిన సుప్రసిద్ధ సంగీత కళాకారులు

గత పది రోజులు లాలాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో లక్షల మంది పాల్గొని ప్రాణాహుతి ద్వారా ధ్యానం చేయడం తన హృదయాన్ని తాకిందన్నారు. లాలాజీ నాకు ప్రేరణగా ఉన్నారని అయన వ్యక్తిత్వం గొప్పతనం ద్వారా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుందని దాజీ అన్నారు.

Kanha Music Festival: ముగిసిన మ్యూజికల్ ఫెస్టివల్.. సంగీత ప్రియులను అలరించిన సుప్రసిద్ధ సంగీత కళాకారులు
Kanha Music Festival
Follow us
Surya Kala

|

Updated on: Feb 04, 2023 | 9:12 AM

హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా కన్హా శాంతి వనంలో కన్హా మ్యూజిక్ ఫెస్టివల్ ఘనంగా ముగిసాయి. ధ్యానం అదిగురువు లాలాజీ మహారాజ్ 150 జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ రామచంద్ర మిషన్ , హార్ట్ ఫుల్ నెస్ నిర్వహించిన మ్యూజికల్ ఫెస్టివల్ సంగీత ప్రియులను సమ్మోహనం చేసింది. ధ్యానం అదిగురువు లాలాజీ మహారాజ్ 150వ జయంతి ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా కన్హా శాంతి వనంలో ఘనంగా ముగిశాయి. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగిన మ్యూజికల్ ఫెస్టివల్ లో దేశంలోని సుప్రసిద్ధ సంగీత కళాకారులు తమ కళానైపుణ్యంతో అలరించారు.

మ్యూజికల్ ఫెస్టివల్ చివరి రోజు ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారులు పద్మభూషణ్ సుధా రఘునాథ్ తనదైన శైలిలో ప్రదర్శన చేశారు. శ్రీ రామచంద్ర మిషన్ ప్రస్తుత అధ్యక్షులు హార్ట్ ఫుల్ నెస్ ఫౌండర్ పద్మభూషణ్ కమలేష్ పటేల్ ‘(దాజీ’)మాట్లాడుతూ, “నా మాస్టర్స్ లెగసీని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పార్టిసిపెంట్స్ ఫాలో అవుతున్నందుకు చాలా ప్రత్యేకమైన సందర్భం అని దాజీ అన్నారు.

గత పది రోజులు లాలాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో లక్షల మంది పాల్గొని ప్రాణాహుతి ద్వారా ధ్యానం చేయడం తన హృదయాన్ని తాకిందన్నారు. లాలాజీ నాకు ప్రేరణగా ఉన్నారని అయన వ్యక్తిత్వం గొప్పతనం ద్వారా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుందని దాజీ అన్నారు.

ఇవి కూడా చదవండి

కన్హ మ్యూజిక్ ఫెస్టివల్ చివరి రోజు MEIL మేనేజింగ్ డైరెక్టర్ సుధా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కన్హ శాంతి వనం తెలంగాణలో టూరిజం అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని సుధా రెడ్డి అన్నారు. ఒకరికి సహాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని పిల్లలకు మహిళలకు తనకు తోచిన సహాయం చేస్తున్నట్లు సుధా రెడ్డి చెప్పారు.

సుమారు 65 దేశాల నుంచి కన్హా శాంతి వనం చేరుకున్న దాజీ ఫాలోవర్స్, ధ్యానం అభ్యాసకుల ముందు కన్హా మ్యూజికల్ ఫెస్టివల్ చివరి రోజు సంగీత ప్రదర్శన ఇవ్వడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పద్మభూషణ్ సుధ రఘునాథన్ అన్నారు.“కన్హ శాంతి వనం వంటి ప్రశాంతమైన అందమైన ప్రదేశం, పూజ్య దాజీ యొక్క దైవ సన్నిధిలో ప్రదర్శన ఇచ్చే అవకాశం నాకు లభించినందుకు అనందం వ్యక్తం చేశారు..

పది రోజుల పాటు జరిగిన కన్హా సంగీతోత్సవంలో ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, రాహుల్ శర్మ, పండిట్ సంజీవ్ అభ్యంకర్ మరియు శశాంక్ సుబ్రమణ్యం, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, మరియు కౌశికి చక్రవర్తివంటి మహానుభావులు తమ సంగీత ప్రదర్శనతో అలరించారు.

Reporter :Anil

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..