Heart Health: ఆ విటమిన్ లోపంతో గుండె సమస్యలు.. నిపుణుల షాకింగ్ విషయాలు..

వివిధ విటమిన్లు, మినరల్స్ లోపం గుండె జబ్బులకు కారణమవుతాయని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా విటమిన్ డి లోపం గుండె పనితీరును దెబ్బతీస్తుందని, అలాగే గుండె పోటుకు కూడా కారణమవుతుందని వెల్లడించాయి.

Heart Health: ఆ విటమిన్ లోపంతో గుండె సమస్యలు.. నిపుణుల షాకింగ్ విషయాలు..
Vitamin D (7)
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 15, 2023 | 6:00 AM

ప్రపంచవ్యాప్తంగా అధిక మరణాలకు గుండె పోటు కారణంగా నిలుస్తుంది. గుండె పోటు ప్రధాన కారణంగా గుండె పనితీరులో గణనీయమైన మార్పులు. అవును వివిధ విటమిన్లు, మినరల్స్ లోపం గుండె జబ్బులకు కారణమవుతాయని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా విటమిన్ డి లోపం గుండె పనితీరును దెబ్బతీస్తుందని, అలాగే గుండె పోటుకు కూడా కారణమవుతుందని వెల్లడించాయి. అయితే విటమిన్ డి, గుండె పనితీరు మధ్య ఉన్న సంబంధం గురించి ఓ సారి తెలుసుకుందాం.

విటమిన్ డి వల్ల గుండెపై ప్రభావం

విటమిన్ డి అనేది పోషక పదార్ధాలు లేదా సూర్యరశ్మి ద్వారా శరీరానికి అందుతుంది.  శరీరానికి విటమిన్ డి 3 అందిన తర్వాత కాలేయం విటమిన్ డిని 25 (ఓహెచ్)డి గా మారుస్తుంది. అలాగే మూత్రపిండాల హైడ్రాక్సిలేషన్ కు దారి తీస్తుంది. దీంతో విటమిన్ డి లోపం కాలేయం, మూత్రపిండాల వ్యాధులకు గురి చేస్తుంది. శరీరమంతా అనేక రకాలైన కణాలు, కణజాలాల్లో విటమిన్ డి గ్రాహకాలు ఉండటం వల్ల అనేక రకాల శారీరక ప్రక్రియలపై విటమిన్ డి ప్రభావం ఉంటుంది. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం వంటి సమస్యలకు కూడా విటమిన్ లోపం కారణంగా నిలుస్తుంది. అలాగే విటమిన్ డి కార్డియోప్రొటెక్టివ్ ప్రక్రియల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్, కండరాల ఫైబర్స్ ఆవిర్భావం, మెరుగైన గ్లూకోస్ టాలరెన్స్ ఉంటాయి. ఇవన్నీ కార్డియోవాస్క్యులార్ డిసీజ్, అలాగే డయాబెటిస్ మెల్లిటస్ రావడాన్ని ఆలస్యం చేస్తాయి. సో మొత్తం పోషక స్థితిపై విటమిన్ డి ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. కాబట్టి విటమిన్ డి కోసం సప్లిమెంట్స్ తీసుకోవడంతో పాటు ఉదయం సమయంలో సూర్యరశ్మి తగిలేలా కూర్చొవడం లేదా వ్యాయామం చేయడం ఉత్తమం.

విటమిన్ డి వల్ల రక్త ప్రసరణ మెరుగు

విటమిన్ డి లోపం అధిక రక్తపోటు,  హార్ట్ ఎటాక్ వంటి సమస్యలకు కారణమవుతుంది. అలాగే విటమిన్ డి శరీరంలో తగిన స్థాయిలో  రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ఇప్పటికే ఉన్న జబ్బులున్న వారికి కూడా మంచి మేలు చేస్తున్నారు.  విటమిన్ డి లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల గుండె పనితీరు మెరుగుపడి రక్తప్రసరణ సజావుగా సాగేలా సాయం చేస్తుంది.  అదనంగా రక్త నాళాలు, ధమనుల సడలింపునకు విటమిన్ డి దోహదపడుతుంది. అలాగే, విటమిన్ డి రక్త నాళాలు, కణాలను బలపరుస్తుంది. తగినంత సమయం ఆరుబయట గడపకపోవడం అలాగే, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోకపోవడం కారణాలు విటమిన్ డి లోపంతో బాధపడేలా చేస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..