AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin D Deficiency: విటమిన్ డి లోపం ఉంటే ఎండలో ఎంత సమయం ఉండాలో తెలుసా.. డాక్టర్లు ఏమంటున్నారంటే..

శరీరంలో విటమిన్ డి లేకపోవడం వల్ల కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులు మొదలవుతాయి.

Vitamin D Deficiency: విటమిన్ డి లోపం ఉంటే ఎండలో ఎంత సమయం ఉండాలో తెలుసా.. డాక్టర్లు ఏమంటున్నారంటే..
విటమిన్ డి రెండు రూపాలు మానవ శరీరానికి ముఖ్యమైనవి. విటమిన్ D2 (ఎర్గోకాల్సిఫెరోల్), విటమిన్ D3 (కోలెకాల్సిఫెరోల్). విటమిన్ D2 ఆహార కూరగాయల మూలాలు, నోటి సప్లిమెంట్ల నుంచి పొందవచ్చు.
Sanjay Kasula
|

Updated on: Dec 03, 2022 | 9:55 AM

Share

శరీరంలో విటమిన్ డి లోపాన్ని తీర్చడానికి ఎండలో కూర్చోవడం, ఎండలో ఆడుకోవడం చాలా ముఖ్యం. ఎముకలు, కీళ్లను బలోపేతం చేయడానికి ఈ విటమిన్ చాలా ముఖ్యమైనది. విటమిన్ డి లోపాన్ని తీర్చడానికి, ఎప్పుడు, ఏ సమయంలో ఎండలో కూర్చోవాలనేది చాలా ముఖ్యం. విటమిన్ డి అనేక ప్రోటీన్లు, ఎంజైమ్‌ల ఏర్పాటులో సహాయపడుతుందని.. అనేక వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది పోషకాహర నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ డి లోపం వల్ల శరీరంలో ఎముకలు, కండరాలు దెబ్బతినడం, జుట్టు రాలడం, మానసిక స్థితిలో మార్పులు, బరువు పెరగడం, శ్వాసకోశ సమస్యలు వంటి అనేక సమస్యలు వస్తాయి. విటమిన్ డిని సన్‌షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఇది సూర్యరశ్మితోపాటు కొన్ని ప్రత్యేక ఆహారాల నుంచి మనకు ఎక్కువగా లభిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం,. శరీరానికి రోజుకు 600 UI విటమిన్ డి అవసరం.

ఇంట్లో ఎండలో కూర్చోవడం ద్వారా మీరు ఈ విటమిన్ లోపాన్ని తీర్చవచ్చుకోవచ్చు. విటమిన్ డి లోపాన్ని తీర్చడానికి సూర్యరశ్మిలో ఎప్పుడు, ఎంతసేపు ఉండాలనే విషయాన్ని నిపుణుల ప్రత్యేకించి సూచించారు. సూర్యరశ్మి కాకుండా, ఏ ఆహారాలు ఈ విటమిన్ లోపాన్ని తీర్చగలవో కూడా మనం తెలుసుకుందాం..

విటమిన్ డి పొందడానికి సూర్యరశ్మిని ఎలా పొందాలంటే..

నిపుణుల అభిప్రాయం ప్రకారం, సూర్ముడు ఉదయించే సమయం.. అంటే సైన్ రైజ్ అవుతున్న సమయంలో లభిస్తుంది. అయితే, మాట్లాడుతూ సూర్యుని కిరణాలు చాలా కఠినంగా లేనప్పుడు ఎండలో కూర్చోవడానికి అనువైన సమయం. ఎందుకంటే బలమైన సూర్యరశ్మికి ప్రత్యక్షంగా గురికావడం వల్ల చర్మపు మెలనోమాకు దారితీయవచ్చు, ఇది ప్రాణాంతకమైనది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎండలో కూర్చున్నప్పుడు ప్రత్యక్ష సూర్యకాంతి నుంచి కళ్లను రక్షించుకోవాలని గుర్తుంచుకోండి.

లిమా మహాజన్ ప్రకారం, చర్మం రంగు ముదురు రంగులో ఉన్న వ్యక్తులు 30 నిమిషాల కంటే ఎక్కువ ఎండలో కూర్చోకూడదు. స్కిన్ కలర్ ఫెయిర్ (లేత చర్మం ఉన్నవారు) 15 నిమిషాలు మాత్రమే ఎండలో ఉండాలి. డాక్టర్ కపూర్ ప్రకారం ఎక్కువ కాలం సూర్యరశ్మికి గురికాకుండా ఉండటం ఉత్తమం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎండలో ఉన్న తర్వాత సన్‌స్క్రీన్ ఉపయోగించండి. ఎండలో కూర్చున్నప్పుడు సన్‌స్క్రీన్ రాయకూడదని గుర్తుంచుకోండి.

విటమిన్ డి లోపాన్ని ఏ ఆహారాలు భర్తీ చేస్తాయి:

  • విటమిన్ డి లోపాన్ని తీర్చడానికి, మీరు సాల్మన్ చేపలను తినవచ్చు. ఈ చేప విటమిన్ డి ఉత్తమ మూలం అని చెప్పవచ్చు.
  • మీరు చేపలు తినడానికి ఇష్టపడకపోతే, మీరు కాడ్ లివర్ ఆయిల్ తీసుకోవచ్చు. కాడ్ లివర్ ఆయిల్ పోషకాలను పొందడానికి గొప్ప మార్గం. ఇది మెడికల్ షాప్ లో లభిస్తుంది.
  • విటమిన్ డి లోపాన్ని తీర్చడానికి, మీరు గుడ్డు పచ్చసొనను తీసుకోవచ్చు. గుడ్లలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
  • విటమిన్ డి లోపాన్ని తీర్చుకోడానికి, మీరు పుట్టగొడుగులు, ఆవు పాలు, సోయా పాలు, నారింజ రసం, వోట్మీల్ తినవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం