AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Health: చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు.. ఈ సింపుల్ చిట్కాలతో తరిమికొట్టేద్దాం..

శీతాకాలం వచ్చేసింది. దానితో పాటే ఫ్లూ, జలుబు వంటి అనేక రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉండటానికి రోగనిరోధక శక్తిపై కొంచెం అదనపు జాగ్రత్త...

Winter Health: చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు.. ఈ సింపుల్ చిట్కాలతో తరిమికొట్టేద్దాం..
Winter Tips
Ganesh Mudavath
|

Updated on: Dec 03, 2022 | 8:27 AM

Share

శీతాకాలం వచ్చేసింది. దానితో పాటే ఫ్లూ, జలుబు వంటి అనేక రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉండటానికి రోగనిరోధక శక్తిపై కొంచెం అదనపు జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరానికి కావాలసిన పోషక అవసరాలు తీర్చడం చాలా అవసరం. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచే విధంగా శీతాకాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. చల్లటి వాతావరణంతో చాలా మంది బయటకు రాకుండా ఇంట్లో ఉండేందుకే ఆసక్తి చూపిస్తుంటారు. ఇది వారి రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. దీంతో వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వైరస్ బారిన పడకుండా ఉండేందుకు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. చలికాలపు ఉదయం వేళల్లో ఒక కప్పు గ్రీన్ టీ తాగాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచే సాధనంగా పనిచేస్తుంది. ఇది అనేక హృదయ సంబంధ వ్యాధులను నిరోధించే అనేక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.

చిలగడదుంపలు, క్యారెట్లు, యాలకులు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి సెల్యులార్ డ్యామేజ్ నుంచి రక్షిస్తాయి. మజ్జిగకు బదులుగా పెరుగు తినండి. ఇది అద్భుతమైన ప్రోబయోటిక్ గా పనిచేస్తుంది. వెచ్చని శక్తిని కలిగి ఉంటుంది. ఆహారంలో రాగి, బజ్రా, రాజ్‌గిరా వంటి మిల్లెట్‌లను చేర్చాలి. ఎందుకంటే వాటిలో విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వ్యాయామం చేయడాన్ని మర్చిపోకూడదు. శరీరం ఎంత యాక్టివ్‌గా ఉంటే అంత మంచి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

హార్మోన్ స్థాయిలను పెంచడానికి విటమిన్ డి చాలా అవసరం. అది శరీరానికి సరైన మోతాదులో అందకపోతే వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అందుకే వీలైనంత వరకు విటమిన్ డి తీసుకోవాలి. కాబట్టి ఉదయం సమయంలో ఎండలో ఉండేందుకు ప్రయత్నించాలి. నిద్రపోయే ముందు పసుపు కలిపిన పాలు తాగాలి. ఇది వాపును తగ్గించడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మసస్సు ప్రశాంతంగా ఉండేందుకు 6-8 గంటల ఆరోగ్యకరమైన నిద్ర తప్పనిసరి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..