AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ వాసులకు శుభవార్త.. విద్యుత్ ఛార్జీల పెంపు లేనట్లే.. ఎప్పటి వరకంటే..

తెలంగాణ ప్రజలకు ఇది నిజంగా శుభవార్తే. రానున్న ఏడాది పాటు విద్యుత్ ఛార్జీల్లో ఎలాంటి మార్పులు ఉండబోవు. ఇదే విషయం తెలంగాణ రాష్ట్ర విద్యుత్

Telangana: తెలంగాణ వాసులకు శుభవార్త.. విద్యుత్ ఛార్జీల పెంపు లేనట్లే.. ఎప్పటి వరకంటే..
Power Subsidy
Shiva Prajapati
|

Updated on: Dec 01, 2022 | 10:55 PM

Share

తెలంగాణ ప్రజలకు ఇది నిజంగా శుభవార్తే. రానున్న ఏడాది పాటు విద్యుత్ ఛార్జీల్లో ఎలాంటి మార్పులు ఉండబోవు. ఇదే విషయం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ)కి బుధవారం సమర్పించిన 2023-2024 సంవత్సరానికి సంబంధించిన నివేదికలో వెల్లడైంది. టీఎస్ఎన్‌పీడీసీఎల్, టీఎస్ఎస్‌పీడీసీఎల్ సంస్థలు విద్యుత్ సమర్పించిన నివేదికల్లో టారీఫ్ పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలేవీ పేర్కొనలేదు. దీంతో 2024 మార్చి వరకు రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు టారిఫ్‌లు పెంచే అవకాశం లేనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే టీఎస్ఈఆర్సీ కనుక పెంచాలని భావిస్తే మాత్రం విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 54,060 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో 83,111 మిలియన్ యూనిట్ల కరెంట్ అవసరం అవుతుందని టీఎస్ఈర్సీకి సమర్పించిన ప్రతిపాదనల్లో పేర్కొంది. ఇక 73,618 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ అమ్మకం జరుగుతుందని అంచనా వేశాయి. సదరన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ రూ. 36,963 కోట్లు, నార్తరన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ రూ. 17,095 కోట్ల ఆదాయాన్ని అంచనా వేశాయి. ఈ రెండు సంస్థలకు విద్యుత్ కొనుగోలు తర్వాత వచ్చే ఆదాయంలో రూ. 10,535 కోట్ల గ్యాప్ వస్తోంది. ఈ గ్యాప్‌ను ప్రభుత్వ మద్ధతుతో పూడ్చాలని భావిస్తున్నాయట. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు.

కాగా, అన్ని వర్గాల వినియోగదారులపై 14% సగటు పెంపుతో ఈ ఏడాది ఏప్రిల్ నుండి విద్యుత్ టారిఫ్‌ను సవరించినందున వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంటే ఏప్రిల్ 2023 నుండి డిస్కమ్‌లు ఎటువంటి పెంపుదల ప్రతిపాదించలేవని అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే, ప్రార్థనా స్థలాలు, ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని అభ్యర్థనలు వచ్చాయని.. త్వరలో జరగనున్న పబ్లిక్ హియరింగ్‌లో కమిషన్ పరిశీలిస్తుందని TSERC చైర్మన్ చెప్పారు. కొన్ని విద్యుత్తు డివిజన్లలో మొత్తం సాంకేతిక, వాణిజ్య నష్టాలు 50% కంటే ఎక్కువగా ఉన్నాయని, వీటిని 15%కి తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

నెల నెలా విద్యుత్ ఛార్జీల సవరణ..

ఇంధన ధరల సర్దుబాటు ఛార్జీలపై శ్రీరంగరావు మాట్లాడుతూ.. థర్మల్ పవర్ స్టేషనలకు సప్లయ్ చేసే బొగ్గు ధర పెరగడం వలన ఇండియా ఎనర్జీ ఎక్స్‌ఛేంజ్ నుంచి డిస్కమ్‌లు రోజువారి విద్యుత్ కొనుగో చేయడం భారంగా మారిందని, దీనికి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చూడాలని కేంద్రం ఆదేశించిందన్నారు. ఇందులో భాగంగానే ప్రతి నెలా విద్యుత్ ఛార్జీలను సవరించాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించిందన్నారు. ‘ఏ అనుమతులు తీసుకోకుండానే ఏప్రిల్ 2023 నుంచి వినియోగదారుల నుంచి నెలవారీ ప్రాతిపదికన యూనిట్‌కు గరిష్టంగా 30 పైసలు వసూలు చేయాలని ఇటీవల డిస్కమ్‌లకు డ్రాఫ్ట్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిస్పందన కోసం టీఎస్ఈర్సీ ఎదురు చూస్తోందని చెప్పారు రంగరావు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..