Gold Price Today: మొదలైన బంగారం సెగ.. భారీగా పెరిగిన గోల్డ్‌ రేట్స్‌.. వరుసగా మూడో రోజు..

బంగారం ధర మరోసారి పెరిగింది. వరుసగా మూడో రోజు గోల్డ్‌ రేట్‌లో పెరుగుదల కనిపించింది. బుధవారం మొదలైన పెరుగుదల శుక్రవారం వరకు కొనసాగింది. శుక్రవారం ఒక్కరోజే రూ. 200 పెరగడం గమనార్హం. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ ధర..

Gold Price Today: మొదలైన బంగారం సెగ.. భారీగా పెరిగిన గోల్డ్‌ రేట్స్‌.. వరుసగా మూడో రోజు..
Gold
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 02, 2022 | 6:32 AM

బంగారం ధర మరోసారి పెరిగింది. వరుసగా మూడో రోజు గోల్డ్‌ రేట్‌లో పెరుగుదల కనిపించింది. బుధవారం మొదలైన పెరుగుదల శుక్రవారం వరకు కొనసాగింది. శుక్రవారం ఒక్కరోజే రూ. 200 పెరగడం గమనార్హం. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 53,330 వద్ద కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల్‌ గోల్డ్‌పై రూ. 100 పెరిగి, రూ. 48,800గా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,800 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 53,330 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 48,750 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 53,180 గా ఉంది.

ఇవి కూడా చదవండి

* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,550 కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్‌ రూ. 54,050 వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్ ధర రూ. 48,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 53,230 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 48,750 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,180 గా ఉంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,750 గా ఉండగా, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్ రూ. 53,180 వద్ద కొనసాగుతోంది.

* సాగరతీరం విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్‌ రూ. 48,750 కాగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 53,180 గా ఉంది.

వెండి ధరలు ఇలా ఉన్నాయి..

వెండి ధరల్లోనూ పెరుగుదల కనిపించింది. వెండి కూడా దూకుడు మీదుంది. వరుసగా రెండు రోజుల పాటు వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో వెండి ధరలు పెరిగాయి. వెండి ధరలు ఇలా ఉన్నాయి. దేశరాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 63,600 వద్ద కొనసాగుతుండగా, ముంబైలో రూ. 63,600 గా ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 69,800 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..